
జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు మృతి చెందగా.. 14 మందికి గాయపడ్డారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కత్రా నుండి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్‌కోట్, కేలా మోర్, బ్యాటరీ చెష్మా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఉధంపూర్, కాజిగుండ్ వద్ద కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్‌వార్, రాంనగర్-ఉధంపూర్, జంగల్వార్-థత్రి మార్గాలు దెబ్బతిన్నాయి.
కథువా జిల్లాలో సహార్ ఖడ్ నదిపై వంతెన దెబ్బతింది. దీంతో జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై రవాణా నిలిచిపోయింది. నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మొధోపూర్ బ్యారేజ్ ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దాటి పోయింది. ఉధంపూర్‌లో తావి నది 20 అడుగుల ప్రమాద స్థాయిని దాటి పోయింది. చెనాబ్ నది 899.3 మీటర్లకు చేరింది. ఆగస్టు 27 వరకు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కాశ్మీర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
⚠️ Heavy rains trigger landslide on Vaishno Devi Yatra Route Near Adhkwari
➡️ 5 pilgrims dead, 14 injured
➡️ Yatra suspended, trains & routes disrupted
➡️ Red alert issued,heavy rains to continue for 40 hrs
Rescue ops & helplines active.#JammuKashmir #VaishnoDevi #jammufloods pic.twitter.com/lGqlw6IYvL— Abheet Sangotra 🇮🇳 (@abheet20) August 26, 2025