
శ్రీనగర్: భారత సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా సెక్టార్‌లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు పేర్కొన్నారు. నౌషెహ్రా నార్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. అప్రమత్తమైన దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా భారతసైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు చుట్టుపక్కల ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారా? అనేదానిపై శోధన ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ నెల ప్రారంభంలో జరిగిన ‘ఆపరేషన్ అఖల్’లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఆగస్టు ఒకటిన ‘ఆపరేషన్ అఖల్’ ప్రారంభమైంది.