ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన పలాష్‌.. చితకబాదిన క్రికెటర్లు?! | Smriti friend claims Palash was caught cheating Cricketers beat him up: Report | Sakshi
Sakshi News home page

ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన పలాష్‌.. చితకబాదిన క్రికెటర్లు?!

Jan 24 2026 11:02 AM | Updated on Jan 24 2026 11:30 AM

Smriti friend claims Palash was caught cheating Cricketers beat him up: Report

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నవంబరు 23న
అసలేం జరిగిందంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్‌ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు.

కాగా తనతో ప్రైవేట్‌గా చాట్‌ చేశాడంటూ పలాష్‌ ముచ్చల్‌ గురించి ఓ మహిళ సోషల్‌ మీడియాలో స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్‌ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి.

ఒకే మంచం మీద వేరే మహిళతో 
ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్‌ మానే వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్‌ సిటీతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేనూ ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

అతడిని కొట్టారు
అప్పుడు పరిస్థితి మొత్తం గంభీరంగా.. భయానకంగా మారిపోయింది. స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారు. ముచ్చల్‌ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే!.. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లిలో సెటిల్‌ అవుతాడని నేను అనుకున్నా. 

కానీ అంతా తలకిందులైపోయింది’’ అని విద్యాన్‌ మానే చెప్పుకొచ్చాడు. కాగా స్మృతి పెళ్లి సంగీత్‌, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్‌ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు.  

మోసం చేశాడు
కాగా ఫిలిం ఫైనాన్సర్‌గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్‌.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్‌ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్‌ ఫోన్‌ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. 

నిరాధార ఆరోపణలు
ఈ క్రమంలోనే అతడిపై చీటింగ్‌ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్‌ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్‌ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు.

ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూపీఎల్‌)-2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని నిలిపింది.   

చదవండి: ఎవరినీ నమ్మను.. ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!.. పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement