
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.
కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.
తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు.