'తప్పు జరిగింది': డెలివరీ ఫీజులపై స్పందించిన సీఈఓ | Zepto CEO Aditya Palicha Admits Mistake On Dark Patterns, Withdraws Pricing Experiment | Sakshi
Sakshi News home page

'తప్పు జరిగింది': డెలివరీ ఫీజులపై స్పందించిన సీఈఓ

Nov 17 2025 3:20 PM | Updated on Nov 17 2025 4:00 PM

Zepto CEO Admits Mistake On Dark Patterns

ధర నిర్ణయాలకు సంబంధించిన వివాదంపై క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కో ఫౌండర్ అండ్ సీఈఓ ఆదిత్ పలిచా స్పందించారు. డార్క్ ప్యాటర్న్‌లను ఉపయోగించడం వల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. కస్టమర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత రావడంతో దీనిని నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

మేము డెలివరీ ఫీజులు, ధరలపై ప్రయోగాలు చేయాలని అనుకున్నాము. దీనికోసం వేర్వేరు విధానాలను ప్రయత్నించాము. దీంతో సోషల్ మీడియాలో వ్యతిరేఖత మొదలైంది. ఇది వినియోగదారులకు సరైనది కాదని గుర్తించాము. అందుకే ఈ విధానాన్ని పూర్తిగా నిలిపివేశామని ఆదిత్ పేర్కొన్నారు. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగదని ఆయన అన్నారు. కాగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో అన్ని హ్యాండ్లింగ్ ఫీజులు & సర్జ్ ఛార్జీలను తొలగించింది. అదే సమయంలో ఉచిత డెలివరీ కోసం దాని కనీస ఆర్డర్ విలువను గణనీయంగా తగ్గించింది.

ఏమిటీ డార్క్ ప్యాటర్న్స్
ఈ-కామర్స్, క్విక్ కామర్స్, రైడ్-హెయిలింగ్ కంపెనీలు తమ యాప్‌లలో అమలు చేసే మానిప్యులేటివ్ అండ్ మోసపూరిత డిజైన్ పద్ధతులను డార్క్ ప్యాటర్న్‌లు అంటారు. దీనిద్వారానే కస్టమర్‌కు తెలియకుండా వివిధ రకాల ఛార్జీలు విధిస్తారు. అయితే ఇవి ప్లాట్‌ఫామ్‌ ఇంటర్‌ఫేస్‌లో ఎక్కడా కనిపించదు. కానీ.. ఆర్డర్‌ చేసి చెక్‌ఔట్‌ చేసే సమయంలో మాత్రమే అదనపు ధరలు కనిపిస్తాయి.

జూన్ 7న, డార్క్ ప్యాటర్న్‌లను గుర్తించడానికి, అటువంటి పద్ధతులను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కంపెనీలు స్వీయ-ఆడిట్‌లు నిర్వహించాలని కేంద్రం ఒక సలహాను జారీ చేసింది. ఇది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి & స్విగ్గీ , జొమాటో, బ్లింకిట్ పేరెంట్ ఎటర్నల్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, టాటా 1ఎంజి, ఓలా, రాపిడోతో సహా బహుళ ఇంటర్నెట్ కంపెనీల మధ్య జరిగిన సమావేశం తర్వాత జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement