ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

Government Teacher Has Becoming Inspiration In Husnabad Division - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌(సిద్దిపేట) : మారుమూల గ్రామాలకు సైతం కాన్వెంట్‌ బస్సులు వచ్చేస్తున్నాయి. సర్కాడు బడులంటే సమస్యల చిరునామాగా మారాయి. ప్రైవేటు పాఠశాలలో ఉన్న వసతులు ప్రభుత్వ బడుల్లో లేవు. చిన్న సంపాదన పరుడైనా పిల్లలకు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రైవేటు బడులకు పంపుతున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను తను పని చేస్తున్న పాఠశాలలోనే పిల్లలను చేర్పించి చదివిస్తున్నాడు. ప్రైవేటు బడుల్లో ఎన్ని హంగులు ఉన్నా.. సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందుతుందని పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.  

తను పని చేసే బడిలోనే చేర్పించాడు.. 
మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోగిటి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి 1998లో డీఎస్‌సీ ద్వారా టీచర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇదే మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాను బోధిస్తున్నారు. తను నడిచిన మార్గంలోనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ బడికే పంపడం  ప్రైవేట్‌ పాఠశాలల్లో రూ. వేలు ఖర్చు చేసి పిల్లలను చదివించే తల్లదండ్రులు సైతం ప్రభుత్వ బడి గురించి ఆలోచించేలా చేస్తుంది. సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్య విమల, గ్రామస్తులు అభినందిస్తున్నారు.  పలువురు ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు.  

బోధనలోనూ ప్రత్యేక శైలీ 
మండలంలోని తంగళ్లపల్లి పాఠశాలలో పనిచేసే సమయంలో సత్యనారాయణ విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేవారు. ప్రత్యేక్షంగా వాటిని చూపించి పాఠం అర్థమయ్యేలా చేస్తారు.  బరువులు కోలతల గురించి చౌకదారుల దుకాణం తీసుకెళ్లి అవగాహన కల్పించడం,  లీటర్లు, కిలో గ్రాముల గురించి వివరించారు. వివిధ వస్తువుల వినియోగాన్ని ప్రత్యేక్షంగా చూపించి ఆ పరిసరాలను వారికి తెలియజేసి భోదించేవారు.  

అక్షయ ఫౌండేషన ద్వారా సేవ.. 
తన మిత్రులలో కలసి సత్యనారాయణ అక్షయ ఫౌండేషన్‌ ద్వారా గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో రెండు నెలల పాటు 200 మందికి ఉచిత మజ్జిక పంపిణీ అందిస్తారు. పేద ప్రజలకు దుస్తులలతోపాటు దుప్పట్లు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు చదువుకు అవసరమైన వస్తువులు అందజేసి వారిని చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటారు. పలు విషయాల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పారుచుకున్న తోగిటి సత్యనారాయణ జిల్లా విద్యాధికారి అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top