సాక్షి, ఖమ్మం: మామిళ్లగూడెం హైస్కూల్ ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి రాథోడ్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారనే కారణంతో ఆమెను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్‌పై గౌతమి కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకనే రీల్స్ చేశానంటూ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడు పని చేయలేదని వాపోయింది. మొదటిసారి తాను ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా చెప్పుంటే బావుండేదన్నారు.
‘‘సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని వాళ్లు పిలిస్తే నేను వెళ్లాను. మా గవర్నమెంట్ స్కూల్‌కి అన్యాయం చేయను. నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు నేనేమైనా హత్యలు చేశానా? గంజాయి లాంటివి ఏమైనా అమ్మానా?.
..నన్ను ఇలా టోల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నన్ను ఎవరు హెచ్చరించలేదు. నేను సబ్జెక్టుకి సంబంధించిన రిలీస్ తప్ప ఏమి చేయలేదు.. విధి నిర్వహణకు వ్యతిరేకంగా నేను రీల్స్ చేయలేదు... ఈ రీల్ కూడా చేయవచ్చో లేదో కూడా నాకు తెలియదు’’ అంటూ గౌతమి భావోద్వేగానికి లోనయ్యారు.


