‘కాంగ్రెస్‌ వచ్చాక ఆదాయం పడిపోయింది’ | BRS Leader Harish Rao Takes On Congress Govt | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ వచ్చాక ఆదాయం పడిపోయింది’

Feb 7 2026 12:25 PM | Updated on Feb 7 2026 1:18 PM

BRS Leader Harish Rao Takes On Congress Govt

సిద్ధిపేట: కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్‌.. కాంగ్రెస్‌ సర్కారుపై మండిపడ్డారు. దొంగ హామీలతో కాంగ్రెస్‌.. ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణ ఆదాయం పడిపోయిందన్నారు. 

హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రండి..
మరొకవైపు అదే సిద్ధిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 3,15,16,4,వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిలోభాగంగా బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఊరు ముఖం తెలియన వాడు.. ఇక్కడకి వచ్చి మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. 

పొన్నం ప్రభాకర్‌ అనే నన్ను ఒకసారి ఎంపీ చేసి పంపితే తెలంగాణ కోసం కొట్లాడి రాష్టం తెచ్చాడని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఈ ఊరు ముఖం తెలియని వ్యక్తి మాత్రం ఏవో మాట్లాడుతున్నారు. నేను శాసన సభ్యుడిని.. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషిస్తే సహించే ప్రసక్తే లేదు. హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రా. సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్ అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్న’ అని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement