Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది

Bhavi Barad: Professional Working on Youth Rights - Sakshi

‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్‌. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ‘ప్రవాహ్‌’లో పని చేస్తున్న భావి బరాద్‌ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది.

కోవిడ్‌ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. 
‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక.
ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్‌’గా ఫస్ట్‌ బ్యాచ్‌కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్‌ ఒకరు.


‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్‌.

సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్‌. 
స్కూల్, కాలేజీలలో జెండర్‌ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్‌ కెరీర్‌కు సంబంధించి ప్యానల్‌ డిస్కషన్‌లలో చురుగ్గా పాల్గొంటుంది.

‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్‌ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..)

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top