పరమ విశిష్టమైన ఏకాదశి.. | The Supremely Significant Ekadashi Inspiration Short Story | Sakshi
Sakshi News home page

పరమ విశిష్టమైన ఏకాదశి..

Jun 11 2026 9:10 AM | Updated on Jun 11 2026 6:29 PM

The Supremely Significant Ekadashi Inspiration Short Story

సందర్భం

ఏకాదశినాడు ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి!

అధికమాసంలో వచ్చే ఏకాదశిని ‘పరమ ఏకాదశి‘ అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ రోజున శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతీతి. యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. నేటి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

ఎందుకని అంతటి విశిష్టత?
‘పరమ‘ అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం మూడేళ్లకోమారు అధికమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనది. విష్ణుప్రీతికరమైనది. ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.

ఏం చేయాలి?
విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః‘ మంత్రాన్ని జపించండి.

దానాలు... పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థికసాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి మార్గం సుగమం అవుతంది. తామర గింజలు లేదా సగ్గుబియ్యంతో పాయసం చేసి లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత కర్పూర హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి, కుటుంబ సభ్యులకు పెట్టడం వల్ల లక్ష్మీవిష్ణువుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

తులసి కోట దగ్గర... 
ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీ నారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement