breaking news
Ekadasi
-
భగీరథ పగిలింది..బావి నిండింది
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో మండలంలోని లక్ష్మీపూర్‌లో చొప్పదండి రాజంకు చెందిన వ్యవసాయ బావి వరదతో పొటెత్తి పొంగిపొర్లింది. రూ.2 లక్షలు వెచ్చించి తవ్వించుకున్న బావి భగీరథ నీటితో దెబ్బతిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై మిషన్ భగీరథ గ్రిడ్ ఇన్చార్జ్ ప్రశాంత్‌ను వివరణ కోరగా తాము పైపులైన్ వేసిన కింద నుంచి బావిని తవ్వడంతో పైపులైన్ దెబ్బతిని లీకేజీకి కారణమైందన్నారు. – కడెం వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకోవడం సహజమే. అయితే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతను తెలియజేస్తోంది. ఇరువైపులా ఉన్న కొండల నడుమ సాగవుతున్న వివిధ రకాల పంటలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ
-
వైభవోపేతం.. ఏకాదశి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలంలో శుక్రవారం ఏకాదశి మహాత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఎగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ఆవరణలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులను పుల్లకిలో కొలువుంచి మాడా వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
సంపదలిచ్చే కల్పవల్లి... మోక్షమిచ్చే తల్లి
నేడు... క్షీరాబ్ధి ద్వాదశి ఈ రోజు తులసి దగ్గర దీపదానం చేస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి. వంద దీపాలను దానం చేసినవారు భగవత్ సాన్నిధ్యం చేరతారు. ఒక వత్తితో దీపం దానమిస్తే, విజ్ఞాని అవుతారు. రెండు వత్తులతో ఇస్తే, రాజు అవుతారు. పది వత్తులతో ఇస్తే, దైవసాక్షాత్కారం లభిస్తుంది. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే, తుదిశ్వాసతో ఆ దైవంలో లీనమవుతారని వ్యాసుడి మాట. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తిక మాసం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వచ్చే మాసం కాబట్టి, దీని పేరు ‘కార్తికం’. ఈ నెలలో రోజూ పుణ్యప్రదమే. కొన్ని ప్రత్యేకదినాలు మరింత పుణ్యప్రదం. వాటిలో ఒకటి - కార్తిక శుక్ల ద్వాదశి. కార్తికంలో 12వ రోజైన ద్వాదశిని ‘క్షీరాబ్ధి ద్వాదశి’ అంటారు. దీనికే ‘మథన ద్వాదశి’, ‘చిలుకు ద్వాదశి’, ‘చినుకు ద్వాదశి’, ‘తీర్థన ద్వాదశి’, ‘తులసి ద్వాదశి’, ‘యోగేశ్వర ద్వాదశి’, ‘హరిబోధిని ద్వాదశి’ - ఇలా రకరకాల పేర్లు. విష్ణుమూర్తి నిద్ర లేచిన నాడు... ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి ముందు రోజు ‘ఉత్థాన ఏకాదశి’. ప్రతీ పక్షానికీ, అంటే పదిహేను రోజులకూ ఏకాదశులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చే ఏకాదశులు అన్నింటిలోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తిక శుద్ధ ఏకాదశి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. కాబట్టి అది ‘శయన ఏకాదశి’. అలా శయనించిన విష్ణుమూర్తి నాలుగు మాసాల తరువాత ఈ కార్తిక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్థానమంటే లేవడమని అర్థం. కాబట్టి, దీనికి ‘ఉత్థాన ఏకాదశి’ అని పేరు. దీన్నే ‘ప్రబోధిన్యేకాదశి’ అని కూడా అంటారు. పాలకడలిని చిలికింది ఈ రోజే! ఆ మరునాడైన ద్వాదశి నాడే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలకడలిని మథించడం మొదలైందని కథనం. క్షీరసాగర మథనం ప్రారంభమైంది కాబట్టి, అది ‘క్షీరాబ్ధి ద్వాదశి’. పాల కడలిని మథించారు. అంటే చిలికారు కాబట్టి, ఇది ‘మథన ద్వాదశి’. మామూలు మాటల్లో ‘చిలుకు ద్వాదశి’. ద్వాదశి ముందు రోజైన ఏకాదశి నాడు పండరీపురంలోని విఠలేశ్వర ఆలయంలో పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. కాయధాన్యాల ఆహారం తినకుండా, ఫలహారం చేయాలి. రాత్రి జాగారం చేయాలి. ద్వాదశి ఉదయాన్నే తలంటు స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. శ్రీహరికి నైవేద్యం పెట్టాలి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఈ అన్నదానం అనంత పుణ్యాన్నిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరంలో కోటిమందికి అన్నదానం చేస్తే వచ్చేంత పుణ్యం ఈ రోజు అన్నదానంతో వస్తుందంటారు. తెలుగు నాట... తులసి, ఉసిరికల పూజ భారతీయ సంప్రదాయంలో తులసి పరమ పవిత్రం, శుభకరం. అందుకనే, స్త్రీలు ప్రతిరోజూ తులసి చెట్టును పూజించి, తులసి చెట్లన్నిటినీ పెంచే ‘బృందావనం’ (తులసి కోట)లో నీళ్ళు పోస్తారు. ఇక, క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి చెట్టును సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిగా భావించి, పూజిస్తారు. ఈ ద్వాదశి నాటి తులసీ పూజ వెనుక ఒక కారణం ఉంది. అప్పటి దాకా పాలకడలిపై శయనించి ఉన్న విష్ణువు ‘ఉత్థాన ఏకాదశి’ నాడు శ్రీమహాలక్ష్మితో కలసి, బ్రహ్మాది దేవతలు వెంట రాగా, తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడని పెద్దల మాట. అందుకే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి చెట్టునూ, ఉసిరిక చెట్టునూ పూజించడం సంప్రదాయం. విష్ణువు, లక్ష్మీదేవి సహితంగా ఈ రెండు చెట్లకూ ఆవు నెయ్యితో తడిపిన 360 వత్తులతో నీరాజనమిస్తారు. ఇంట్లో ఉసిరిక చెట్టు ఉండకపోవచ్చు కాబట్టి, తులసి చెట్టు పక్కనే, ఉసిరి కాయతో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పాతి, పూజ చేయడం ఆచారం. అందుకే, ‘క్షీరాబ్ధిశయన వ్రతకల్పం’లో ‘తులసీ సహిత ధాత్రీ లక్ష్మీనారాయణ’, ‘తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ’ లాంటి మాటలు కనిపిస్తాయి. ‘ధాత్రి’ అంటే ఉసిరిక అనీ అర్థం. ఈ ద్వాదశికి ఉసిరికాయల్లో పూజా సమయంలో దీపారాధన చేయడం తెలుగు నాట ఆచారం! తులసి, ఉసిరిక ఒకేచోట, ఒకేసారి పుట్టినట్లు ‘శివపురాణ’ కథ. ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం’ చేస్తే కోర్కెలన్నీ నెరవేరతాయని ధర్మరాజుకు వ్యాసుడు చెప్పాడు. ఎలా పూజించాలి? ద్వాదశి నాటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలన్నిటినీ పెంచే తులసి కోట దగ్గర స్త్రీలు శుభ్రం చేసి, ముగ్గులు తీర్చాలి. తులసి కోటను అలంకరించాలి. తులసికి కుంకుమ పెట్టాలి. కోట చుట్టూ దీపాలు వెలిగించాలి. దీపారాధనకు ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ శ్రేష్ఠం. ధూప, దీప, నైవేద్యాలతో తులసిని పూజించి, విష్ణు స్తోత్రం, లక్ష్మీ స్తుతి చేస్తారు. ఇది కాక కొందరికి తులసి చెట్టును చీరతో అలంకరించి, పువ్వులు, ఎర్ర గాజులు పెట్టి, తాంబూలం కూడా సమర్పించే ఆచారం ఉంది. ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా శ్రద్ధాసక్తులతో శ్రీమహావిష్ణువునూ, తులసినీ పూజిస్తే సమస్త పాపాలూ నశిస్తాయి. విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. మహారాష్ట్రలో... తులసీ కల్యాణం మహారాష్ర్ట, మాళవ ప్రాంతాల్లో ఈ రోజున శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడికీ, తులసికీ కల్యాణం చేసే సంప్రదాయం ఉంది. పాలకడలిని చిలుకుతుంటే కల్పవృక్షం, కామధేనువు పుట్టాయి. లక్ష్మీదేవి కూడా అలా పాలకడలి నుంచి పుట్టినదే. ఆమెను క్షీరాబ్ధి ద్వాదశి నాడే విష్ణుమూర్తి వివాహం చేసుకున్నట్లు మరో కథనం. దానికి గుర్తుగా ఏటా ఆనాటి సాయంత్ర వేళ లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు అవతారమైన కృష్ణుడికీ, లక్ష్మికి ప్రతిరూపమైన తులసికీ కల్యాణం చేస్తారు. తెలుగునాట ఈ తులసి వివాహతంతు లేదు కానీ, తులసి పూజ ఎక్కువ. కార్తికంలో నిత్య దీపారాధన శ్రేష్ఠం. రోజూ చేయలేకపోయినా, కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమినాడైనా దీపారాధన మంచిది. తులసి వద్ద దీపారాధన చేసినంతనే అమితపుణ్యమిచ్చే రోజు కాబట్టే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి అంత విశిష్టత. నమ స్తులసి కల్యాణి... నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి... నమః సంపత్ ప్రదాయికే. - రెంటాల జయదేవ -
ఏకాదశి శోభ