
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో మండలంలోని లక్ష్మీపూర్‌లో చొప్పదండి రాజంకు చెందిన వ్యవసాయ బావి వరదతో పొటెత్తి పొంగిపొర్లింది. రూ.2 లక్షలు వెచ్చించి తవ్వించుకున్న బావి భగీరథ నీటితో దెబ్బతిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై మిషన్ భగీరథ గ్రిడ్ ఇన్‌చార్జ్ ప్రశాంత్‌ను వివరణ కోరగా తాము పైపులైన్ వేసిన కింద నుంచి బావిని తవ్వడంతో పైపులైన్ దెబ్బతిని లీకేజీకి కారణమైందన్నారు. – కడెం

వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకోవడం సహజమే. అయితే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతను తెలియజేస్తోంది. ఇరువైపులా ఉన్న కొండల నడుమ సాగవుతున్న వివిధ రకాల పంటలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
