
గోరింటాకుతో మహిళల సందడి
సంప్రదాయ దుస్తుల్లో పండుగ వాతావరణం
ఆచారాన్ని గుర్తు చేసుకుంటున్న మహిళలు
కొత్తపల్లి: ఆషాడ వచ్చిందంటే బాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గదిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ కరీంనగర్ సూర్యన గర్-5లోని మహిళలు గురువారం మైదాకు పెట్టు కొని సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. పం డుగ వాతావరణంలో గోరెంట తెంపి, దండి.. చేతులు, పాదాలకు పెట్టుకొని అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని గుర్తు చేశారు.
కొత్త పెళ్లి కూతుళ్ల సౌభాగ్యానికి..
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరు కోవడం ఆనవాయితీగా వస్తోంది. సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింది ఉన్న మనసు. మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి, గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదురుగానే కాకుండా, గోళ్లు పెళుసు బారకుండా, గోరు చుట్టు లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ యుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్ద చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు. అట్ల తద్ది, ఇతర శుభకార్యాలకు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తారు. అలా ఏడాది కొన్ని సార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దల ఉద్దేశం.
కోన్లతో జాగ్రత్త
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరకే కోన్లు పెట్టుకుంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది.కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరువు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే , అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
గోరింటతో లాభాలు
జ్యేష్ట మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషారం వాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పని పరిస్థితులు నెలకొంటాయి. ఇక పాలం పనులు చేసుకునే రైతులు, ఏరు దాటాల్సి వచ్చేవారు.. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా ఉండలేని రోజులు. అలాటి సమయంలోచర్మ వ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజంగా మారింది. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. కనుక ఆషాడమాసం నాటికి గోరింట చెట్లు లేత గోరింటతో కళకళలాడతాయి. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏ మాత్రం హాని కలడదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్ల బడుతుంది. ఈ మార్పులు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబర్చి దోషాల బారిన పడకుండా చేస్తుంది.
ఆరోగ్యానికి గోరింట
ఆరోగ్యానికి గోరింట దోహదపడుతుందని వాతావారణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల సంభవించే శ్వాసకోస వంటి దోషాలను తొలగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్టాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుందని గర్భాశయ దోషాలు తీసేస్తుందని శాస్త్రం చెబుతోంది. - సవేరా ప్రభుత్వ ఉద్యోగి.
సంప్రదాయానికి ప్రతీక
ఆషాఢమాసంలో గోరింట పెట్టుకోవడం సాంప్రదాయానికి ప్రతీక , గోరింట అందంతో పాటు, ఆరోగ్యాన్నిస్తుంది. కొత్తగా పెళ్లైన మహిళ ఆషాఢంలో పుట్టింటికి చేరుకొని, గోరింటను పండించుకోవడం సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. ఆగరోగ్యాన్నిచ్చే గోరింటాకుకు బదులు కోన్లు వాడటం మానుకోవాలి.- గడ్డం సవిత గృహిణి