పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...! | Pooja Saxena's Success Story In A Photobook | Sakshi
Sakshi News home page

పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...!

May 29 2026 7:52 AM | Updated on May 29 2026 7:52 AM

Pooja Saxena's Success Story In A Photobook

రంగుల కళ.. ఫొటోబుక్‌

నగరాల్లోని వీధుల్లో నడవడం అనేది కళాత్మక ప్రయాణం కూడా! షాపులపై రంగు రంగుల అందమైన బోర్డులు కనిపిస్తాయి. రంగు వెలిసిన బోర్డులు కూడా కొత్త అందంతో వెలిగిపోతుంటాయి. ఈ అందాలకు పుస్తక రూపం ఇచ్చింది పూజా సక్సేనా.

దిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల్లోని మూడు వందల సైన్‌బోర్డ్‌లపై ఫొటోబుక్‌ తీసుకువచ్చింది పూజ.
దిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో చదువుతున్న రోజుల నుంచి పూజకు సైన్‌బోర్డ్‌లపై ఉన్న అందమైన అక్షరాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేలా చేసింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్‌ రీడింగ్‌లో టైప్‌ఫేస్‌ డిజైన్‌ను స్టడీ చేసింది.

ఈ ఫొటోబుక్‌లో దిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మండీ హౌజ్‌లోని శ్రీరామ్‌ సెంటర్‌ నుండి పహర్‌గంజ్‌లోని ఇంపీరియల్‌ సినిమా థియేటర్‌ వరకు సైన్‌బోర్డ్‌లపై ఎన్నో భాషలలో అందమైన, అద్భుతమైన అక్షర శైలులు!

దురదృష్టమేమిటంటే... దిల్లీలో కనువిందు చేసే అలనాటి సైన్‌బోర్డ్‌లు క్రమంగా మాయమవుతున్నాయి.
సైన్‌బోర్ట్‌ల కోసం వీధులు చుట్టి రావడమే కాదు పాత ఆర్కైవ్స్‌ నుంచి ఫొటోలను సేకరించడం ప్రారంభించింది పూజ. ఆ ఫొటోలలో అలనాటి అందమైన సైన్‌బోర్ట్‌లు ఎన్నో కనిపిస్తాయి.
ఫ్యూచర్‌ డాక్యుమెంటేషన్‌లో భాగంగా భువనేశ్వర్, సౌత్‌ గోవా, కోయంబత్తూరు, మీరట్‌... లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటోంది పూజా సక్సెనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement