
ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహణ
7 సమ్మిట్స్ పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు
ఈ ఘనత సాధించిన ప్రపంచ రెండో, దేశంలో మొదటి బాలుడు
నగర బాలుడు విశ్వనాథకు పలువురి ప్రశంసలు
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో
బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), కోసియస్‌కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు.
చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్
అమ్మ మాటే ప్రేరణ..
ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు.
చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
ఈ తరానికి స్పూర్తి..
ఈ పయనంలో విశ్వనాథ్‌కు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు భరత్, లెఫ్టినెంట్ రోమిల్ బారాథ్వల్ (ఇండియన్ ఆర్మీ రిటైర్డ్) పాత్ర కీలకం. రోమిల్ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్‌కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం.