వోగ్ బ్యూటీ అవార్డ్స్‌: సమంతా స్టన్నింగ్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా | Vogue Beauty Awards Samantha Ruth Prabhu Makes Stunning Look Cut-Out Dress | Sakshi
Sakshi News home page

వోగ్ బ్యూటీ అవార్డ్స్‌: సమంతా స్టన్నింగ్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా

May 27 2025 1:21 PM | Updated on May 27 2025 3:39 PM

Vogue Beauty Awards Samantha Ruth Prabhu Makes Stunning Look Cut-Out Dress

స్టార్‌ హీరోయిన్‌ సమంతా రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu ) ముంబైలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్‌ (Vogue Beauty Awards)లో కటౌట్ డ్రెస్‌లో టోన్డ్-బాడీతో కనిపించి  ఫ్యాన్స్‌ని విస్మయ పర్చింది. నిర్మాతగా  శుభం మూవీ విజయం తరువాత సమంత  చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది.   రాజ్ నిడిమోరుతో డేటింగ్ బజ్ మధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో ఆమె డ్రెస్, స్టన్నింగ్ లుక్ వైరల్‌గా మారింది.

మే 26న సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి అదితి రావు హైదరి, శిల్పా శెట్టి కుంద్రా, భూమి పెడ్నేకర్, సారా టెండూల్కర్  లాంటి అనేక మంది బాలీవుడ్ దివాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత లుక్‌  ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, దృష్టినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం, సమంత చాక్లెట్ బ్రౌన్-హ్యూడ్ బాడీ-ఫిటెడ్ గౌనులోదుస్తుల్లో మెరిసింది.  సమంత టోన్డ్‌ బాడీ,   గిరజాల జుట్టులో లుక్ ను మరింత హైలైట్‌గా నిలిచింది. సమంతలుక్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గాకాగానే నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కునిపించారు. నిజంగా సమంతనా? డిఫరెంట్‌ కనిపిస్తోంది"మునుపటి కంటే సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు" ‘‘కాన్స్‌ ఫెస్టివల్‌కు   ఎందుకు వెళ్లలేదు’’ లాంటి కమెంట్లు వెల్లు వెత్తాయి. "ఆమె ఎందుకు అంత సన్నగా కనిపిస్తోంది?" అని మరికొందరు ఆశ్చర్యపోయారు.

 

వోగ్ బ్యూటీ అవార్డ్స్‌ కార్యక్రమంలో శిల్పా శెట్టి  కాలర్డ్ స్కర్ట్ , క్రాప్ టాప్ ధరించింది. మరోవైపు, సారా టెండూల్కర్ నల్లటి దుస్తులు ధరించి, హాఫ్-బన్‌ హోయిర్‌ స్టైల్‌లోనూ,అదితి రావు హైదరి నల్లటి బంగారు రంగు గ్లిట్టర్ గౌనులో మెరిసింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement