breaking news
beaty
-
వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu ) ముంబైలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ (Vogue Beauty Awards)లో కటౌట్ డ్రెస్‌లో టోన్డ్-బాడీతో కనిపించి ఫ్యాన్స్‌ని విస్మయ పర్చింది. నిర్మాతగా శుభం మూవీ విజయం తరువాత సమంత చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజ్ నిడిమోరుతో డేటింగ్ బజ్ మధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో ఆమె డ్రెస్, స్టన్నింగ్ లుక్ వైరల్‌గా మారింది.మే 26న సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి అదితి రావు హైదరి, శిల్పా శెట్టి కుంద్రా, భూమి పెడ్నేకర్, సారా టెండూల్కర్ లాంటి అనేక మంది బాలీవుడ్ దివాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, దృష్టినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం, సమంత చాక్లెట్ బ్రౌన్-హ్యూడ్ బాడీ-ఫిటెడ్ గౌనులోదుస్తుల్లో మెరిసింది. సమంత టోన్డ్ బాడీ, గిరజాల జుట్టులో లుక్ ను మరింత హైలైట్‌గా నిలిచింది. సమంతలుక్కు సంబంధించిన వీడియో వైరల్గాకాగానే నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కునిపించారు. నిజంగా సమంతనా? డిఫరెంట్ కనిపిస్తోంది"మునుపటి కంటే సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు" ‘‘కాన్స్ ఫెస్టివల్‌కు ఎందుకు వెళ్లలేదు’’ లాంటి కమెంట్లు వెల్లు వెత్తాయి. "ఆమె ఎందుకు అంత సన్నగా కనిపిస్తోంది?" అని మరికొందరు ఆశ్చర్యపోయారు.Serving fire with every curve @Samanthaprabhu2 x @VOGUEIndia! 😍 🔗 https://t.co/tG3hraSulg #VogueBeautyAwards2025#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/B2Cycjeu1g— Samantha FC || TWTS™ (@Teamtwts2) May 27, 2025 వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో శిల్పా శెట్టి కాలర్డ్ స్కర్ట్ , క్రాప్ టాప్ ధరించింది. మరోవైపు, సారా టెండూల్కర్ నల్లటి దుస్తులు ధరించి, హాఫ్-బన్ హోయిర్ స్టైల్లోనూ,అదితి రావు హైదరి నల్లటి బంగారు రంగు గ్లిట్టర్ గౌనులో మెరిసింది. -
షో స్టాపర్స్ బ్యూటీ హంట్
షో స్టాపర్స్ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యూటీ హంట్ నిర్వహిస్తోంది. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. అక్టోబర్ 8 నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 2021 శుక్రవారం 15 అక్టోబర్న మొదలై అక్టోబర్ 24 వరకు బ్యూటీ హంట్ కొనసాగుతుంది. దీనికి జడ్జిగా నటి శిల్పాశెట్టి వ్యవహరించనున్నారు. షో స్టాపర్స్లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ఈ బ్యూటీ హంట్ సందర్భంగా బ్యూటీ ట్రెండ్స్, టాలెంట్స్, క్రియేటివిటీ, అద్భుతమైన ఆఫర్లు, మాస్టర్ క్లాసులను షో స్టాపర్స్ అందివ్వనుంది. -
తులసిదళం.. ముఖ సౌందర్యం...
గులాబి రేకుల్లా మృదువుగా ఉండాల్సిన ముఖం మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలతో నిండిపోయిందా? అయితే వాటిని దూరం చేసే ఔషధం మీ పెరట్లోనే ఉంది. 10–15 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి, దాన్ని టొమాటో గుజ్జుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ∙ ఈ వర్షాకాలంలో వానకు తడిసీ తడిసీ జుట్టు సౌందర్యాన్ని కోల్పోతుంది. అలా కాకుండా కురులు నిగనిగలాడాలంటే... ∙ తలంటు స్నానం చేసిన ప్రతిసారి రెండు టీ స్పూన్ల (శనగ పిండి), ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకొని వాటన్నింటిని కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. రెండు వారాల్లో కనీసం ఇలా నాలుగుసార్లు చేస్తే మేనితో సమానంగా మెరిసే కురులు మీ సొంతం. చేతులు, పాదాల చర్మకాంతి పెరగాలంటే... మూడు స్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్ వాటర్‌ను బాగా కలపాలి. దాన్ని కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో చుండ్రు మాయమవుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. -
జీవన సౌందర్యం
-
వ్యర్థాలతో అపురూపాలు