breaking news
mountaneering
-
Vishwanath Karthikey అమ్మమాటతో శిఖరాలకు, అరుదైన రికార్డు
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), కోసియస్కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్అమ్మ మాటే ప్రేరణ..ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాఈ తరానికి స్పూర్తి.. ఈ పయనంలో విశ్వనాథ్‌కు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు భరత్, లెఫ్టినెంట్ రోమిల్ బారాథ్వల్ (ఇండియన్ ఆర్మీ రిటైర్డ్) పాత్ర కీలకం. రోమిల్ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్‌కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం. -
అంతులేని విషాదంగా మారిన వీడియో
డెహ్రాడూన్: నందాదేవి పర్వతారోహణకు వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నవారి చివరి వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు మంగళవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చివరికి విషాదంగా మారింది. సాయంత్రం సూర్యుడు మంచును ముద్దాడుతున్నట్టుగా మనోహరంగా కనిపించే దృశ్యంతో ప్రారంభమవుతుందీ వీడియో. ఇందులో ఎనిమిది మంది సభ్యులు మంచుతో కప్పబడ్డ పర్వతంపై శిఖరాన్ని అధిరోహించడానికి తాడు సహాయంతో ఒకరివెంట ఒకరు నడుస్తున్నారు. చివరిగా నడుస్తున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వినిపించడంతో వీడియో ఆగిపోతుంది. ఈ శబ్దాన్ని హిమపాతం లేదా మంచు తుపానుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హిమపాతం వల్లే వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హిమాలయ శ్రేణుల్లో అత్యంత కష్టతరమైన పర్వతాల్లో ఒకటైన నందాదేవి శిఖరాన్ని అధిరోహించటానికి ఎనిమిది మంది సభ్యులు పూనుకున్నారు. వీరిలో ఏడుగురు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌కు చెందిన వారు కాగా మరొకరు ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధికారి. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లాలో మే 13న మున్సారీ నుంచి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మే 25 నుంచి ఈ బృందం కనిపించకుండా పోయింది. వారిని గుర్తించటం కోసం పర్వత యుద్ధాలకు శిక్షణ పొందిన డేర్‌డెవిల్స్ బృందం ఆపరేషన్ చేపట్టింది. దీనికోసం 500 గంటలు అంటే సుమారు 15 రోజులు శ్రమించి జూలై 3న భూమికి 19 వేల అడుగుల ఎత్తులో మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను పితోరాఘర్‌కు తరలించారు. మృతదేహాలు లభ్యమైన ప్రదేశంలో ఒక కెమెరా కూడా లభించింది. ఇందులోని వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు వారి ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. Last visuals of the mountaineers' team near the summit on unnamed peak near the #NandaDevi east. ITBP search team of mountaineers found the memory video device at 19K ft while they were searching the area where bodies were spotted. pic.twitter.com/0BI87MEA8Y — ITBP (@ITBP_official) July 8, 2019 -
పర్వతారోహణలో ‘రాణి’ంపు
పోలసానిపల్లి (భీమడోలు): పోలసానిపల్లి సాంఘిక సంక్షే మ గురుకుల బాలికల కళాశాల సీని యర్ ఎంపీసీ విద్యార్థిని బొడ్డు రాణి ఎవరెస్ట్ పర్వత శ్రేణిలోని 17 వేల అడుగుల ఎత్తయిన మౌంట్ రేనార్క్ను అధిరోహించి సత్తాచాటింది. శనివారం కళాశాలకు వచ్చిన రాణికి తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో 28 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధం చేశారు. వీరిలో 15 మంది సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు, 13 మంది గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉన్నారు. వీరంతా గతంలో రాష్ట్రస్థాయి గురుకుల పోటీ ల్లో విజేతలుగా నిలిచివారే కావడం విశేషం. జిల్లా నుంచి పోలసానిపల్లి గురుకుల పాఠశాల నుంచి లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెం దిన బొడ్డు రాణి ఎంపికైంది. వీరందరికీ ఎవరెస్ట్ అధిరోహించిన శేఖర్‌బాబు పర్యవేక్షణలో అక్టోబర్ నెలలో విజయవాడ సమీపంలోని కేతనకొండ ను అధిరోహించేందుకు ఆరు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ బృందం నవంబర్ 12న డార్జింగ్కు బయలుదేరింది. వీరి ని అక్కడ ఉన్న డాస్కింగ్ మార్కే అనే ట్రైనింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. 28 మందిని రెండు గ్రూపులకు ఆరేసి మం ది చొప్పున, మిగిలిన రెండు గ్రూపుల్లో 8 మందిగా విభజించారు. వీరంతా రేనార్క్ పర్వతాన్ని అధిరోహించగా బొడ్డు రాణి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. మిగతా జట్ల కన్నా గంట ముందుగా గమ్యాన్ని చేరుకుంది. జి ల్లాలోని పెదవేగి గురుకులానికి చెందిన çసద్దిపాముల వేణు, వట్లూరు గురుకులానికి చెందిన బొబ్బిలి దీప్తి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరంతా వచ్చే మే నెలలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఎంవీవీ సూర్యారావు తెలిపారు. అనంతరం బొడ్డు రాణి, అధ్యాపకులు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కలిశారు. -
ఎవరెస్టు సాహసయాత్రకు కర్నూలు వాసి
ఎవరెస్టు శిఖరంపై విజయబావుటా ఎగరేసేందుకు ఓ తెలుగు యువకుడు నడుం కట్టాడు. కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన తిమ్మినేని భరత్.. కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఈ నెల 9నుంచి సాహసయాత్ర చేపట్టనున్నాడు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన యాత్ర వివరాల్ని తెలిపాడు. ఇప్పటికే ఎన్నో పర్వతాల్ని ఎక్కిన తనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు చైనా ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు లభించాయని, యాత్రకు అయ్యే రూ.25 లక్షలను అభయ ఫౌండేషన్, మైత్రీ మూవీ మేకర్స్, సోదరి బిందు తమ్మినేని భరిస్తున్నరని చెప్పారు. ఈనెల 6న కర్నూలులో బయల్దేరి, 9న చైనా నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకుగాను 50 నుంచి 55 రోజులు పడుతుంది. భరత్ తోపాటు కొందరు అమెరికన్లు కూడా ఎవరెస్టు అధిరోహణకు బయలుదేరనున్నారు.