హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైళ్లు.. | Centre Showers Boon on Hyderabad with High Speed Rail Corridors | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు వరాల జల్లు.. మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లు

Feb 1 2026 11:54 AM | Updated on Feb 1 2026 6:26 PM

Centre Showers Boon on Hyderabad with High Speed Rail Corridors

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో భాగంగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ నుంచి ఉండటం విశేషం.

ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..
* ముంబై – పూణే
* పూణే – హైదరాబాద్
* హైదరాబాద్ – బెంగళూరు
* హైదరాబాద్ – చెన్నై
* చెన్నై – బెంగళూరు
* బెంగళూరు – వారణాసి
* వారణాసి – సిలిగురి

ఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement