బ్రూస్‌ లీ ఆరాధించిన భారత్‌ ఫహిల్వాన్‌ ఎవరో తెలుసా?

Gama Pehelwan Unbeaten Indian Wrestler Whom Bruce Lee Used To Idolise - Sakshi

మార్షల్‌ ఆర్ట్స్‌ దిగ్గజం.. దివంగత హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  బ్రూస్‌ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువ‌స్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు.  చిన్న వయసులోనే మార్షల్‌ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్‌ లీ 'ఎంటర్‌ ది డ్రాగన్‌' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ సాధించాడు.

మరి బ్రూస్‌ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్‌ భక‌్ష్‌ భట్‌.. అలియాస్‌ గ్రేట్‌ గామా ఫహిల్వాన్‌. గామా ఫహిల్వాన్‌ ఫిజిక్‌కు ముచ్చటపడిన బ్రూస్‌ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్‌ ఎక్సర్‌సైజ్‌ ఫుటేజీలు, రెజ్లింగ్‌ టెక్నిక్స్‌ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్‌ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్‌ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్‌ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్‌ దారి చూపాడని బ్రూస్‌ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. 

కాగా గామా ఫహిల్వాన్‌ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్‌ అతని ఫోటోను డూడుల్‌గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్‌ గూగూల్‌కు గామా ఫహిల్వాన్‌ కార్టూన్‌ను గీసిచ్చాడు. భారత రెజ్లర్‌గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్‌ భక్ష్‌ భట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్‌లో ఓటమి ఎరుగని రెజ్లర్‌గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్‌ మోడల్‌గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్‌ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్‌ రాసుకొచ్చింది. 

మహ్మద్‌ భక్ష్ భట్‌ తన అంతర్జాతీయ రెజ్లింగ్‌ కెరీర్లో 1910లో వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌షిప్‌, 1927లో వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచాడు. వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన తర్వాత టైగర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top