Pramod Bhagath:ప్రమోద్‌ భగత్‌ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం

Pramodh Baghat Inspirational Story Won Gold Medal Tokyo Paralympics - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపితం చేశాడు.. ప్రమోద్‌ భగత్‌. 1988 జూన్‌ 4న ఒడిశాలో జన్మించాడు.  చిన్న వయసులోనే ప్రమోద్‌ భగత్‌  పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్‌ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్‌ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు.

అలా బ్యాడ్మింటన్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్‌వన్‌ పారా షట్లర్‌గా ఎదిగాడు. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 కేటగిరీలో ప్రపంచనెంబర్‌వన్‌గా ఎదిగిన ప్రమోద్‌ భగత్‌ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం. 

చదవండి: చరిత్ర సృష్టించిన ప్రమోద్‌ భగత్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు
ప్రమోద్‌ భగత్‌ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్‌ను ఆడుతుండగా చూసిన ప్రమోద్‌ దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్‌ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్‌ కొల్లగొట్టాడు. అనంతరం పారా బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసిన ప్రమోద్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్‌ వేదికగా పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో పోటీ పడిన ప్రమోద్‌ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారిలో ప్రమోద్‌ భగత్‌ ముందు వరుసలో ఉండగా.. తాజా విజయంతో దానిని సాకారం చేశాడు.

చదవండి: అంధ అథ్లెట్‌కు ట్రాక్‌పైనే లవ్‌ ప్ర‌పోజ్ చేసిన గైడ్‌


ప్రమోద్‌ భగత్‌ సాధించిన పతకాలు.. రికార్డులు
►SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రమోద్‌ భగత్‌ రికార్డు
►ఐడబ్ల్యూఏఎస్‌ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్‌, డబుల్స్ ,మిక్సడ్‌ డబుల్స్ ఈవెంట్‌లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.
►ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో  సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.
►ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్‌, కాంస్య పతకాలు
►2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.
►RYLA ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top