Tokyo Paralympics: Shuttler Pramod Bhagat Wins Gold In SL3 Badminton - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ప్రమోద్‌ భగత్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

Sep 4 2021 4:35 PM | Updated on Sep 4 2021 5:01 PM

Tokyo Paralympics: Shuttler Pramod Bhagat Wins Gold In SL3 Badminton - Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌.. ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు. ఈ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో ఇదే తొలి పతకం కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement