
స్వేచ్ఛా జీవితం అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం మాత్రమే కాదు తమ అభిరుచులను కూడా నైపుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం అంటోంది నేటి యువత. తమ భావి జీవన నిర్మాణాన్ని బాధ్యతగా మలుచుకోవడమూ దేశభక్తే అని చెబుతోంది. వివిధ రంగాలలో రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు. ముంబైలో ఉంటూ నటిగా, మోడల్‌గా నిరూపించుకుంటోంది దియా సీతేపల్లి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ, జెండర్ ఈక్వాలిటీకి కృషి చేస్తోంది ఢిల్లీ శ్రీరామ్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న శ్రీహిత. ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన కాకినాడ శ్రీదేవి సైకాలజీ చేస్తానంటోంది.
డిగ్రీ చేస్తూ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంటున్న హరిణి, క్యారమ్స్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించి, యూకే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హుస్నా సమీర.. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఎంతటి కష్టమైనా...
జూనియర్ ఇంటర్ టైమ్‌లోనే మోడలింగ్ ఫ్రీలాన్స్ చేశాను. ఏజెన్సీతో కలిసి పనిచేశాను. హైదరాబాద్‌లోని లేడీస్ బ్రాండ్స్‌కి మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద బాగా ఇష్టం. లాక్‌డౌన్ టైమ్‌లో ‘ప్రేమకథ’ సినిమా చేశా. తమిళ సినిమాకు వర్క్ చేశాను. ముంబైలో ఉంటూ మోడలింగ్‌గా నా కెరియర్‌ను కొనసాగిస్తున్నాను. ఆడిషన్స్ చేస్తుంటాను. నా ఇష్టాన్ని అమ్మనాన్నలు కాదనలేదు.
నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముంబై వంటి మహానగరంలో మనవాళ్లు ఎలా నిలదొక్కుకుంటారు, అమ్మాయిలు కదా... లాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే. మన వర్క్‌ని ఎంత బెస్ట్‌గా ఇవ్వగలుగుతున్నాం అనే దానిపైన దృష్టి ఉండాలి. సక్సెస్ కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.
– దియా సీతేపల్లి, నటి, మోడల్
అభిరుచులకు మద్దతు
క్యారమ్స్‌లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ రికార్డ్ సాధించాను. యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కాలీగ్రఫీ, మ్యాథమేటిక్స్‌లో అవార్డులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను.
వ్యాపారవేత్తగా రాణించాలని, క్యారమ్స్‌లోనూ మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తున్నాను. నా ఇష్టాలకు, అభిరుచులకు అమ్మనాన్నలు చాలా సపోర్ట్ నిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇలా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి వారిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.
– హుస్నా సమీర
జెండర్ ఈక్వాలిటీకి కృషి
నేను టెన్త్ క్లాస్‌లోనే శాస్త్రీయ నృత్యంలో సర్టిఫికెట్స్ తీసుకున్నాను. కూచిపూడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మ్యాథ్స్, సైన్స్ వైపు కాకుండా పొలిటికల్ సైన్స్ వైపు వచ్చాను. యూపీఎస్సీలో ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. ఢిల్లీ శ్రీరామ్ కాలే జ్ ఫర్ ఉమెన్‌లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తున్నాను.
కాలేజీలో ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ఎడిటోరియల్ టీమ్‌కు సబ్ హెడ్‌గా ఉంటూనే, ఎన్‌ఎస్‌ఎస్ ఆర్గనైజేషన్‌లో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తున్నాను. ఒక లక్ష్యంతో పాటు అభిరుచికి తగిన స్కిల్‌ను నేర్చుకోవాలి. అంతేకాదు సమాజానికి మన వంతు భాగస్వామ్యాన్ని, సేవను అందించాలి. అందుకు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి.
– శ్రీహిత నీలి
మల్టిపుల్ స్కిల్స్ మస్ట్
స్కూల్ టైమ్‌లోనే హిందీ పండిట్ కోర్సు చేశాను. సంగీతం అంటే ఇష్టం ఉండటంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, సంగీత విశారద డిగ్రీ కోర్సు పూర్తిచేశాను. వాలీబాల్ స్టేట్‌లెవల్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాను. ఈమధ్య బీటెక్ అవుతూనే క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ వచ్చింది. కర్ణాటక సంగీతంలో కచేరీలు ఇస్తుంటాను. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో అక్కడ కచేరీలో పాల్గొన్నాను.
మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటాను. జాబ్ చేస్తూనే సింగర్‌గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పడు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నాను. సాంకేతికపరంగా ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక చదువు మాత్రమే ఉంటే సరిపోదు.
ఇలా విభిన్న రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచులను కూడా స్కిల్స్‌గా డెవలప్ చేసుకుంటే మన వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. లైఫ్ అంతా ఉపయుక్తంగా మార్చుకుంటూ వెళితే చాలా హ్యాపీగా ఉంటాం.
– హరిణి ఆనంద్ చెరుకూరి
సైకాలజీ స్టార్
‘కోర్టు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ చేస్తున్నాను. జూనియర్ ఇంటర్ పూర్తయ్యింది. సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. జెన్ జి తరం చాలా ఆందోళన, డిప్రెషన్‌తో లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు. అందుకే, సైకాలజీ చేసి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్సను అందించాలనుకుంటున్నాను.
డ్యాన్స్, కుకింగ్ నా ఫేవరేట్స్. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. రీల్స్ చేయడం ద్వారా పేరొచ్చింది. మూవీలో అవకాశం వచ్చింది. అమ్మ ఓకే అంది. అలా జాలీగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటాను.
– కాకినాడ శ్రీదేవి, నటి
(చదవండి: