
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు.
అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు.
వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..
ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు.
జీవనశైలిపై దృష్టి సారించాలి..
ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.
ఎందకు ఈ హెచ్చరికలు అంటే..
ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.
ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.
బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..
ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
టైప్ 2 డయాబెటిస్
రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు
రొమ్ము, పెద్దప్రేగు కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్లు
కీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.
దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.
ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..
ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.
ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..
ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..
వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు.
ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి.
డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.
గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)