breaking news
Independence celebration
-
డాలస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ, నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు. డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.(చదవండి: బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు) -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..
స్వేచ్ఛా జీవితం అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం మాత్రమే కాదు తమ అభిరుచులను కూడా నైపుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం అంటోంది నేటి యువత. తమ భావి జీవన నిర్మాణాన్ని బాధ్యతగా మలుచుకోవడమూ దేశభక్తే అని చెబుతోంది. వివిధ రంగాలలో రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు. ముంబైలో ఉంటూ నటిగా, మోడల్‌గా నిరూపించుకుంటోంది దియా సీతేపల్లి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ, జెండర్ ఈక్వాలిటీకి కృషి చేస్తోంది ఢిల్లీ శ్రీరామ్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న శ్రీహిత. ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన కాకినాడ శ్రీదేవి సైకాలజీ చేస్తానంటోంది. డిగ్రీ చేస్తూ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంటున్న హరిణి, క్యారమ్స్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించి, యూకే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హుస్నా సమీర.. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతటి కష్టమైనా...జూనియర్ ఇంటర్ టైమ్‌లోనే మోడలింగ్ ఫ్రీలాన్స్ చేశాను. ఏజెన్సీతో కలిసి పనిచేశాను. హైదరాబాద్‌లోని లేడీస్ బ్రాండ్స్‌కి మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద బాగా ఇష్టం. లాక్డౌన్ టైమ్‌లో ‘ప్రేమకథ’ సినిమా చేశా. తమిళ సినిమాకు వర్క్ చేశాను. ముంబైలో ఉంటూ మోడలింగ్‌గా నా కెరియర్ను కొనసాగిస్తున్నాను. ఆడిషన్స్ చేస్తుంటాను. నా ఇష్టాన్ని అమ్మనాన్నలు కాదనలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముంబై వంటి మహానగరంలో మనవాళ్లు ఎలా నిలదొక్కుకుంటారు, అమ్మాయిలు కదా... లాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే. మన వర్క్‌ని ఎంత బెస్ట్‌గా ఇవ్వగలుగుతున్నాం అనే దానిపైన దృష్టి ఉండాలి. సక్సెస్ కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. – దియా సీతేపల్లి, నటి, మోడల్అభిరుచులకు మద్దతుక్యారమ్స్లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ రికార్డ్ సాధించాను. యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కాలీగ్రఫీ, మ్యాథమేటిక్స్‌లో అవార్డులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. వ్యాపారవేత్తగా రాణించాలని, క్యారమ్స్‌లోనూ మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తున్నాను. నా ఇష్టాలకు, అభిరుచులకు అమ్మనాన్నలు చాలా సపోర్ట్ నిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇలా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి వారిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. – హుస్నా సమీరజెండర్ ఈక్వాలిటీకి కృషినేను టెన్త్ క్లాస్‌లోనే శాస్త్రీయ నృత్యంలో సర్టిఫికెట్స్ తీసుకున్నాను. కూచిపూడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. మ్యాథ్స్, సైన్స్ వైపు కాకుండా పొలిటికల్ సైన్స్ వైపు వచ్చాను. యూపీఎస్సీలో ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. ఢిల్లీ శ్రీరామ్ కాలే జ్ ఫర్ ఉమెన్‌లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తున్నాను. కాలేజీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఎడిటోరియల్ టీమ్‌కు సబ్ హెడ్‌గా ఉంటూనే, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్‌లో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తున్నాను. ఒక లక్ష్యంతో పాటు అభిరుచికి తగిన స్కిల్‌ను నేర్చుకోవాలి. అంతేకాదు సమాజానికి మన వంతు భాగస్వామ్యాన్ని, సేవను అందించాలి. అందుకు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. – శ్రీహిత నీలి మల్టిపుల్ స్కిల్స్ మస్ట్స్కూల్ టైమ్‌లోనే హిందీ పండిట్ కోర్సు చేశాను. సంగీతం అంటే ఇష్టం ఉండటంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, సంగీత విశారద డిగ్రీ కోర్సు పూర్తిచేశాను. వాలీబాల్ స్టేట్‌లెవల్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఈమధ్య బీటెక్ అవుతూనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. కర్ణాటక సంగీతంలో కచేరీలు ఇస్తుంటాను. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో అక్కడ కచేరీలో పాల్గొన్నాను. మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటాను. జాబ్ చేస్తూనే సింగర్‌గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పడు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నాను. సాంకేతికపరంగా ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక చదువు మాత్రమే ఉంటే సరిపోదు. ఇలా విభిన్న రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచులను కూడా స్కిల్స్గా డెవలప్ చేసుకుంటే మన వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. లైఫ్ అంతా ఉపయుక్తంగా మార్చుకుంటూ వెళితే చాలా హ్యాపీగా ఉంటాం. – హరిణి ఆనంద్ చెరుకూరిసైకాలజీ స్టార్‘కోర్టు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ చేస్తున్నాను. జూనియర్ ఇంటర్ పూర్తయ్యింది. సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. జెన్ జి తరం చాలా ఆందోళన, డిప్రెషన్‌తో లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు. అందుకే, సైకాలజీ చేసి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్సను అందించాలనుకుంటున్నాను. డ్యాన్స్, కుకింగ్ నా ఫేవరేట్స్. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. రీల్స్ చేయడం ద్వారా పేరొచ్చింది. మూవీలో అవకాశం వచ్చింది. అమ్మ ఓకే అంది. అలా జాలీగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటాను. – కాకినాడ శ్రీదేవి, నటి (చదవండి: -
స్వాతంత్య్రదినోత్సవ థీమ్...! ఒక్కొక్కరు ఒక్కొలా దేశభక్తి..
థీమ్ అనేది అలంకార్రప్రాయం కాదు. మన భవిష్యత్ లక్ష్యాల గురించి బలంగా చెప్పే... సంక్షిప్త సందేశం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా ‘నయా భారత్’ అని ఈ స్వాతంత్య్ర దినోత్సవం థీమ్‌ను నిర్ణయించారు.డాలీగారి దేశభక్తి‘దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది’ అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్ డాగ్‌గా పాపులర్ అయిన డాలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్ వేసి ‘ఆహా’ అనిపించేలా చేసింది డాలీ. ‘శునక రాజమా... నీ దేశభక్తికి జోహార్లు’ అంటున్నారు నెటిజనులు.ఈ అమెరికన్ మన జాతీయగీతం అద్భుతంగా ఆలపిస్తాడు!పదిహేడు సంవత్సరాల అమెరికన్ గేబ్ మెరిట్ ఆలపించిన మన జాతీయగీతం ‘జన గణ మన’ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ‘ఓ మై గాడ్... నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసింది దిశ అనే నెటిజన్. ‘ఎన్నో దేశాల జాతీయగీతాలు పాడినప్పటికీ గేబ్‌కు మన జాతీయగీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం’ అని రాసింది దిశ.తండ్రి పేరు వందేమాతరం..!‘పేరులో పవర్ ఉంటుంది’ అంటారు. కొన్ని పేర్లు వింటే ‘నిజమే!’ అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఈ కుటుంబసభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందేమాతరం ప్రహ్లాద్ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురు పేరు జైహింద్ జగ్యన్సేని. ‘మతాన్ని ప్రతిఫలించే పేర్లు కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం’ అంటున్న వందేమాతరం స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందేమాతరం ఇంటిలోని గదులు జాతీయజెండాలోని మూడు రంగులతో అలంకరించి ఉంటాయి.అంటార్కిటికాలో వందేమాతరంఅంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్ట్ పదిహేను పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయజెండా ఎగరేయడానికి సన్నద్ధం అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘మేము సైతం’ అంటూ జాతీయపతాకావిష్కరణకు సన్నద్ధం అవుతున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. ఉద్యోగులు మంచుపెకిలిస్తుంటే, నేపథ్యంలో ‘వందేమాతర గీతం’ వినిపిస్తుంటుంది. (చదవండి: ఒక్కొక్కరం ఒక్కో రంగు) -
ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..
ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీ/మోడల్/క్రీడాకారిణో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివశించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా..!.టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు( Jamuna Tudu). చేతిలో ఒక కర్రతో అడవంతా కలియతిరిగే ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే..పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచ్చుకున్న ఆమె ప్రస్థానం ఏవిధంగా సాగిందంటే..జార్ఖండ్‌కి చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది(చట్టం ఉల్లంఘమైన పని కలప కోత, కొనుగోలు, అమ్మకం). అంతేగాదు అడవులను రక్షించుకునేలా గ్రామస్తులను, స్థానికులను చైతన్యపరిచేది. అడవిని కాపాడుకోవలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థెర్యాన్ని, తెగువని చూపేది. ఆ లక్ష్యంలోకి మరికొంత మంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. అలా ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటిని నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమునా అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అంతేగాదు అడువుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం కారణంగానే ఆమెకు 'లేడీ టార్జాన్'గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమునా స్పందిస్తూ..ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనమని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు) -
కింజరాపు వారి బంధుప్రీతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ వచ్చి చేరుతాయనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఆ కేటాయింపులో సైతం పూర్తిగా బంధు ప్రీతి చూపిస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టేయడం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకే చెల్లుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలో కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ కింజరాపు సురేష్‌ను ఎంపిక చేశారు. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా..? ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సొంత అన్న కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకు సొంత బాబాయ్ కుమారుడు. జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతంగా సేవలు అందజేసిన సర్పంచ్‌లు ఉన్నప్పటికీ కేవలం బంధుప్రీతిని చూపించుకుంటూ సొంత కుటుంబ సభ్యుడిని స్వాతంత్య్ర వేడుకలకు ఎంపిక చేయడంపై సొంత పారీ్టకి చెందిన వారే విస్తుపోతున్నారు. అటు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వకపోగా, కనీసం ఇలాంటి సామా జిక కార్యక్రమాల్లో సైతం ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఇదే మాదిరిగా ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు కేంద్రమంత్రికి వరుసకు మామ, రాష్ట్ర మంత్రికి వరుసకు మేనత్త కొడుకైన దోమ మోహన్‌రావు, ఆయన భార్య పుణ్యవతిని ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి అప్పట్లో విమర్శలపాలయ్యారు. వేడుకల ఎంపిక సిఫార్సులో పూర్తిగా పక్షపాతం.. ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు గ్రామ స్థాయిలో సర్పంచ్ల ఎంపిక విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు పూర్తిగా పక్షపాత వైఖరి చూపించా రు. వాస్తవంగా ప్రతి పంచాయతీలో అభివృద్ధికి సంబంధించి ఆయా సర్పంచ్‌లు చేసిన కృషి, నిధుల వినియోగంలో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని వేడుకలకు సిఫార్సులు చేస్తారు. ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో తమకు అడ్డే లేదన్న మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ కింజరాపు కుటుంబం బంధు ప్రీతిని చూపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇదే సురేష్ పై పోటీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ సర్పంచ్‌తో పాటు కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసిన సంఘటనల్లో నిమ్మాడ సర్పంచ్ సురేష్ కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
విభజన టైంలో వీళ్ల ‘చేదు’ అనుభవాలు వింటారా?
1947లో భారతదేశ విభజన చాలా మందికి తమ పూర్వీకులను కోల్పోయేలా చేసింది. వారు పెరిగిన వాతావరణంలోని ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే.. ఈ విభజన చాలామందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒక్క రాత్రితో తమ జీవితాలనే మార్చేసిన విభజన అది. అలాంటి భాధనే ఎదుర్కొన్న నలుగురు వృద్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ టైంలో ఈ విభజన ఎలా తమ ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేసిందో వివరించారు. విభజన కారణంగా చెలరేగిన ఘర్షణలు, అల్లకల్లోలంతో రాత్రికి రాత్రే తమ పూర్వీకులను వదిలిపెట్టి భారత్‌లోకి లేదంటే పాక్‌లో వెళ్లిపోవాల్సి వచ్చింది. కొందరికి అది తీరని విషాదాన్ని కలిగించి, చేదు జ్ఞాపకాలుగా మిగిలింది. అది వారికి కేవలం తమ వాళ్లను మాత్రమే దూరం చేయలేదు, ఆఖరికి వారి ఆహారపు అలవాట్లను సంస్కృతిని ప్రభావితం చేసింది. అదెలాగో ఆ వృద్ధుల మాటల్లోనే చూద్దాం..!రషేదా సిద్ధిఖీ, 24 ఆగస్టు 1947"ఇది మాకు ఇష్టమైన వారిని వదులుకునేలా చేసింది. అలాగే సాంప్రదాయ వంటకాలకు, వివిధ పదార్థాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కొత్త పరిసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు పరిమితం కావడం ఓ సవాలుగా మారింది. ఉన్న వాటితో మా వంటకాలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుబాటులోని వనరులతోనే వంటలను చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాత ఢిల్లీ ఇప్పుడది లక్నో. తాము తినే తినుబండరాల దుకాణాలు, కేఫ్‌లు ఇప్పుడూ అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు రషేదా. అయితే ఇప్పుడు మరెన్నో అంతర్జాతీయ వంటకాలు, ఫాస్ట్ పుడ్స్ వంటివి చేరడం విశేషం." అన్నారు. శీలావంతి, 10 ఆగస్టు 1935కరాచీలో మాకు పొలాల నుంచి తాజా కూరగాయలు వచ్చేవి. కావాల్సినవి ఇష్టంగా తినేవాళ్లం. అలాగే నా తోబుట్టువులతో చిన్న చిన్న దుకాణాలకు వెళ్లేవాళ్లం. సింధీ రోటీ వంటివి తినేవాళ్లం. తాజాగా తినే ఫ్రూట్ సలాడ్స్ మిస్ అవుతున్నాం. మళ్లీ కరాచీ వెళ్లి పూర్వీకులను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు శీలావంతి. శిఖా రాయ్ చౌదరి, ఆగస్టు 14, 1939సరిగ్గా నాకు ఏడేల్లు వయసులో ఫరీద్పూర్(బంగ్లాదేశ్)లోని ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్‌ని, సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ కాలంలో గ్రామఫోన్‌లో పాటలు వినేవాళ్లం. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో రుచికరమైన అల్పాహారం అంటే మహా ఇష్టం. అవన్నీ మిస్సయ్యానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శిఖా రాయ్గౌరీ రే, ఆగస్ట్ 9, 1944"విభజన మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మా తాతల టైంలోనే బంగ్లాదేశ్‌ని విడిచి వచ్చేశాం. మాకు దుబ్రిలో వెదరుతో చేసిన ఇల్లు ఉండేది. అదీగాక నేనే కోల్‌కతా, డిళ్లీ రెండు నగరాల్లో పెరిగాను. స్కూల్ చదవంతా కోలకతాలో సాగగా, కాలేజ్ చదవంతా ఢిల్లీలో చదివాను. అలాగే మా కుటుంబం పార్క్ స్ట్రీట్ రెస్టారెంట్‌కి వెళ్లేది. అయితే అప్పట్లో థాయ్, కొరియన్, జపనీస్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్లు లేవు." అని చెప్పుకొచ్చారు గౌరీ రే.ఉమా సేన్, 1939"విభజన కారణంగా మేము భూమిని, ఇంటిని కోల్పోయాం. అలాగే మాకు ఇష్టమైన వంటకాలను, రుచులను మార్చుకోవాల్సి వచ్చింది. స్నేహితులను, పూర్వీకులు కోల్పోయాం. ఇప్పుడు మేమున్న ప్రదేశం రద్దీగా మారిపోయింది. అలాగే కొత్తకొత్త వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు". ఉమాసేన్.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
"మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని యావత్ భారతదేశంలోనే గాదు విదేశాల్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు యూకేలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకి సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌తో తెగ ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ సంగీత కళాకారుడు " మా తుఝే సలాం", 'సందేసే ఆతే హై' 'తేరీ మిట్టి' వంటి పాటలతో యూకేలోని భారతీయలును అలరించాడు. యూకే వీధులన్ని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలతో సందడిగా మారాయి. యూకేలో ఈ వేడుకను భారతీయులు, పాకిస్తానీయులు కలిసి జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా బ్రిటీష్ సామ్రాజ్యం ముంగిటే ఈ వేడుకలను భారతీయులు పాకిస్తానీయులు ఘనంగా జరుపుకోవం మరింత విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగానే నెటిజన్ల అంతా ఈ స్వాతంత్య్ర దినోత్సవం అత్యంత విశేషమైనది. భారతీయుల దేశభక్తి పాటలతో యూకే వీధులు మారుమ్రోగాయి. భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛవాయువులను పీల్చుకున్న ఈ శుభదినాన్ని రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ముందే సగర్వంగా జరుపుకోవడం అత్యంత సంతోషంగా ఉంది. ఇది అత్యంత భావోద్వేగకరమైన క్షణం అంటూ అక్కడున్న భారతీయులందర్నీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Vish (@vish.music) (చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే) -
Independence Day: అంతా పగలు జెండా ఎగరువేస్తే..అక్కడ మాత్రం..
అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉదయమే జరుపుకుంటే అక్కడ మాత్రం అర్థరాత్రే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అంతా ఒకలా చేస్తే ఆ రాష్ట్రంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? పైగా వారికి అనాదిగా వస్తున్న సంప్రదాయమట. వారి పూర్వీకుల నుంచి ఇలానే చేస్తున్నారట. అసలు ఎందుకిలా అంటే.. బిహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలోని వాసులు మాత్రం అర్థరాత్రి 12.01 గంటలకు జెండా చౌక్ అనే ప్రాంతంలో జెండా ఎగురవేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నారు. వారంతా నాటి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు.. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది, మనకు స్వాతంత్య్రం వచ్చింది అని ప్రకటించడం.. రేడియోలకి అతుక్కుపోయి మరీ విన్నారు. ఆ తర్వాత వెంటనే పుర్నియా వాసి రామేశ్వరప్రసాద్ సింగ్, దాదాపు పదివేలమంది వ్యక్తులంత కలిసి ఇలా నెహ్రు ప్రకటించగానే అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం అతని వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించిందని, ఇప్పుడూ మనవడు విపుల్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..) -
వందేమాతరం నినాదాలతో హోరెత్తిన ‘శిరసాని హిల్స్’ పరేడ్
పుట్టపర్తి అర్బన్: ప్రతి హృదయమూ పులకించింది. దేశభక్తితో ఉప్పొంగిపోయింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన సందర్భంగా పుట్టపర్తి ‘శిరసాని హిల్స్’ పరేడ్ మైదానం వందేమాతర నినాదాలతో హోరెత్తింది. శ్రీసత్యసాయి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. చిన్నారులంతా త్రివర్ణపతాకం చేబూని దేశ భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వేదికపైన ఉన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు సహా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సుమారు గంట పాటు మైమరచిపోయి ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో గోరంట్లకు చెందిన ఉదయ్‌కిరణ్ పాఠశాల, శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల, వివేకానంద పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ఎస్డీజీఎస్ కళాశాల హిందూపురం, కేజీబీవీ బుక్కపట్నం, గురుకుల పాఠశాల కొడిగిన హళ్లి, మోడల్‌స్కూల్ పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తదితర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మా తుజే సలాం, జయహో.., దేశ్ మేరా రంగీలా.., ఎత్తర జెండా, పోరాట యోధుల త్యాగాలు.., దేశం మనదే..,వందేమాతరం.., మేమే ఇండియన్స్ తదితర పాటలతో హోరెత్తించారు. పిరమిడ్ యోగా విన్యాసాలు, ఆదివాసీ గిరిజన నృత్యాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. -
గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
15 రోజుల పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ఇంటింటా త్రివర్ణ పతాకం (హర్ ఘర్ తిరంగా) నినాదంతో 2022 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుందామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మొత్తం 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని, అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జాతీయ జెండాలను పంపిణీ చేస్తామన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై రాష్ట్ర సాంస్కృతికశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఆర్ఓ గాయత్రిదేవి, ఆన్సెట్ సీఈఓ కేశవ నాయుడు, జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. (చదవండి: మధ్య తరగతికి మంచి ఛాన్స్.. తక్కువ ధరకే ప్లాట్లు.. అర్హతలు ఇలా) -
స్వాతంత్ర వేడుకులకు ముస్తాబవుతున్న ఇందిరా గాంధీ స్టేడియం
-
మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ పరేడ్, సీఎం ప్రసంగం మాక్‌డ్రిల్‌ను పోలీసులు నిర్వహించారు. ఈ వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతినిచ్చినట్లు తెలిపారు. వర్షం కురిసినా పరేడ్‌కు అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. అదిరిపోయే ఆఫర్లతో పండగే పండగ
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఆఫర్ల పండుగ మొదలైంది. పంద్రాగస్ట్ను పురస్కరించుకొని అమెజాన్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్' ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళమీరు జులైలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే.. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో గాడ్జెట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సేల్ సందర్భంగా కష్టమర్లకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్ ఎస్బీఐతో టై అప్ అయ్యింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సేల్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ( గరిష్టంగా రూ.1750) కొనుగోలు చేస్తే 10 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఆపిల్ ఐఫోన్ 11 అమెజాన్ సేల్ లో ఆపిల్ ఐఫోన్ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు కోసం పేరొందిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 రూ.79,900విలువైన ఆపిల్ ఐఫోన్ 12ను ఈ ఆఫర్ లో 11,901 తగ్గుతుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎక్సేంజ్ ఆఫర్లో రూ.13,400 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.వీటితో పాటు వన్ ప్లస్ 9జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బ్రాండ్లపై ఆఫర్లు అమెజాన్‌కు చెందిన డివైజ్ ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే ఈ బుక్ రీడర్స్ పై ఆఫర్లు లభిస్తాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈ సోనీ డబ్ల్యూహెచ్ ఎక్స్ఎం3 వైర్ లెస్ హెడ్ ఫోన్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఆపిల్ వాచ్ సిరీస్ ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2020 హెచ్ పీ పెవిలియన్ గేమింగ్ ల్యాప్ ట్యాప్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : ఈనెల(ఆగష్టు) 15న రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె సంబంధిత శాఖల అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. (చదవండి : కొత్త వర్సిటీల ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్) ముఖ్యంగా కరోనా నేపథ్యంలో దాని నివారణకు వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్నవిప్లవాత్మక చర్యలను ఈవేడుకల ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రత్యేక దృష్టిపెట్టి ఈవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. (చదవండి : స్థానిక సంస్థల పాలనపై కీలక నిర్ణయం) ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహనను పెంపొందించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన పధకాలపై ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. దీనిపై సాధారణ పరిపాలన,వైద్య ఆరోగ్యం,సమాచారశాఖ, కృష్ణా జిల్లా కలక్టర్, పోలీస్ కమీషనర్లు కూర్చిని చర్చించుకుని ఒక ప్రణాళికతో వస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో ఈవేడుకలను ఘనంగా నిరవహించేందుకు చర్యలు తీసుకుందామని సీఎస్ నీలం సాహ్నిచెప్పారు. ఈ జూమ్ వీడియో సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కమీషనర్ కె భాస్కర్, విజయవాడ పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాస్,సీపీడీసీఎల్ సీఎండీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సైనికులతో ధోనీ సందడి
శ్రీనగర్ : టీం ఇండియా మాజీ కెప్టెన్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన మహేంద్ర సింగ్ ధోని లఢక్‌లో సైనికుల సమక్షంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లఢక్ కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన విషయం తెలిసిందే. బుధవారం లఢక్‌కు చేరుకున్న ధోనికి సైనిక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. సైనికులతో ఈ సందర్భంగా ధోని ముచ్చటించారు. అనంతరం ఆర్మీ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన ధోనీ రోగులతో మాట్లాడారు. అంతకుముందు ధోని ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లఢక్ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డింగ్ సహా పలు విధులు నిర్వర్తించారు. టీం ఇండియా నుంచి రెండు నెలల విరామం తీసుకున్న ధోని తాజాగా వెస్టిండీస్ టూర్లో ఉన్న భారత జట్టుకు దూరంగా ఉన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు భద్రత కట్టుదిట్టం
సాక్షి, విజయవాడ : ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని, పోలీసు శాఖలోని అన్ని విభాగాల సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో సభాప్రాంగణం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఏ1, ఏ2, ఏ3, బి1,బి2 గా పాసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ1, ఏ2, ఏ3, పాస్‌లు ఉన్న వారికి వాహనాల పార్కింగ్ కోసం హ్యాండ్ బాల్ మైదానం, బిషప్ హజరయ్య స్కూల్ కేటాయించామన్నారు. బి1,బి2 పాసులు ఉన్నవారికి ఏఅర్ గ్రౌండ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్, అర్ ఆండ్ బీ సెల్లార్లో పార్కింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు, తల్లిదండ్రులకు 5, 6 గేట్ల నుంచి ప్రవేశం కల్పించామని అన్నారు. -
‘ఆటవిక’ అధికారి
- జాతీయ జెండాను అవమానించిన రేంజర్ - పతాకావిష్కరణ సమయంలో బెల్ట్ షాపులో తాగుతూ... అశ్వారావుపేట రూరల్: దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోతే.. ఓ అటవీశాఖ రేంజర్ మాత్రం జాతీయ జెండా ఆవిష్కరించాల్సిన సమయంలో మద్యం తాగుతూ కూర్చున్నాడు. మద్యం మత్తులో కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తూ.. ఆవిష్కరణకు సిద్ధం చేసిన జెండాకర్రను ఓ మూలన పెట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో మంగళవారం జరిగింది. అచ్యుతాపురం క్రాస్ రోడ్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో రేంజర్‌గా పని చేస్తున్న సదానందాచారి ఉదయం జెండావిష్కరణ సమయంలో మద్యం మత్తులోనే కార్యాలయానికి వచ్చాడు. స్వాతంత్య్ర వేడుకల కోసం అప్పటికే సిబ్బంది జాతీయ జెండా, మహాత్మాగాంధీ చిత్రపటం, కొబ్బరికాయలు, మిఠాయిలు, బిస్కెట్లు సిద్ధం చేశారు. జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్.. తాపీగా సిగరెట్ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్‌షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు. బీరు మాత్రమే తాగా : రేంజర్ ఈ ఘటనపై రేంజర్ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మరిచిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని, మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టేబుల్‌పై సిద్ధంగా ఉంచిన జాతీయ జెండా, కొబ్బరికాయలు, ఇతర సామగ్రి -
స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ దేశంలోని గ్లౌస్టర్ చర్చికి చెందిన పది మంది బృందం గత కొద్ది రోజులుగా డోర్నకల్ మండలంలో పర్యటిస్తున్నారు. చర్చి కాంపౌండ్‌లో డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు. -
సీఎంల గైర్హాజరుపై స్పందించిన గవర్నర్
-
గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం
-
సీఎంల గైర్హాజరుపై స్పందించిన గవర్నర్
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరవడంపై గవర్నర్ నరసింహన్ సరదాగా స్పందించారు. ఇద్దరు సీఎంలు రాకపోవడమన్నది సత్యమని, అయితే ఎందుకు రాలేదన్న విషయంపై ఓ నిర్ణయానికి రావద్దని నరసింహన్ అన్నారు. రెండు రాష్ట్రాలకు, ఇద్దరు సీఎంలకు తాను ఆమోదయోగ్యమైనవాడినని గవర్నర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్నంత వరకు అందరూ తనను ఆమోదిస్తారని వ్యాఖ్యానించారు. విందుకు ముఖ్యమంత్రులు రాలేదని అడుగుతున్నారు కానీ, తాను, మీరు ఉన్నది సరిపోదా అని మీడియాను ఉద్దేశించి గవర్నర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు. -
గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ ఈ విందుకు చంద్రబాబు , కేసీఆర్ సహా పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు. -
పంద్రాగస్టు పండుగ కోటలోనే..
నిర్ణయించిన జిల్లా యంత్రాంగం వేదిక స్థలం పరిశీలించిన అధికారులు ముస్తాబవుతున్న కోట పరిసరాలు ఖిలావరంగల్ : తెలంగాణ రాష్ట్రం లో తొలిసారి జరుగుతున్న స్వాతం త్య్ర వేడుకలను చారిత్రక కాకతీ యుల రాజధాని వరంగల్ కోటలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. కోటలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వేడుకలు జరిగే స్థలాన్ని వరంగల్ నగరపాలక సంస్థ కార్మికులు చదును చేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సురేందర్‌కరణ్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు,అడిషనల్ ఎస్పీ యాదయ్య, ట్రాఫిక్ ఓస్డీ వాసుసేన, డీఎస్పీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం ఖిలావరంగల్‌కు వచ్చి వేడుకల స్థలాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర వేడుకలకు ఖుష్‌మహల్ పక్కన ఉన్న ప్రైవేటు స్థలాన్ని పరిశీలించారు. ప్రధాన వేదిక, పరేడ్, ప్రేక్షకులు కుర్చునే స్థలం, శకటాల ప్రదర్శన, రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, వీవీఐపీల భధ్రత లాంటి ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోట పరిసరాలను పరిశీలించారు. కేంద్ర పురావస్తుశాఖ సమన్వయకర్తలు కుమరస్వామి, సుబ్బారావులను.. ఖుష్‌మహల్ విస్తీర్ణం, అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న రెండు ఎకరాల ప్రైవేటు స్థలం, మినీ పార్క్ స్థలం రెండూ కలిపితే వేడుకలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఖుష్‌మహల్ పక్కన పిచ్చిమొక్కలతో నిండి ఉన్న స్థలాన్ని త్వరగా తీర్చిదిద్దాలని డీఆర్వో సురేందర్‌కరణ్ వరంగల్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.