వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌ | - | Sakshi
Sakshi News home page

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌

Jan 23 2026 6:41 AM | Updated on Jan 23 2026 6:41 AM

వేగంగ

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌ భూవివాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం పామాయిల్‌ ఫ్యాక్టరీని పరిరక్షించాలి భోజన కార్మికులకు బిల్లుల బెంగ స్కేటింగ్‌లో అ‘ద్వితీయం’

కై కలూరు: గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణ కమిటీల డిజిటలైజేషన్‌ వేగవంతం చే యాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కలిదిండి మండలం మట్టగుంట వైఎస్సార్‌సీపీ గ్రామ అ ధ్యక్షుడు బొమ్మిడి మర్రాజు ఇంటి వద్ద గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఫొటో వివరాలు డిజిటలైజేషన్‌ చేశారు. కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమాని రమేష్‌, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కొల్లాటి సత్యనారాయణ, రేవు నరసింహారావు, సిరింకి జల్సారాయుడు, తిరుమని నాగేశ్వర రావు, కొప్పనాతి యేసురాజు, బొడ్డు దుర్గాప్రసాద్‌, బలగం శ్యాంబాబు పాల్గొన్నారు.

చాట్రాయి: అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భూమి వివాదంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం మేరకు మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతి దాసు, అన్న రామచంద్రయ్య మధ్య భూవివాదం నెలకొంది. మూడు నెలల క్రితం వివాదంలో ఉన్న 90 సెంట్ల భూమిలో తమ్ముడు తిరుపతిదాసు మామిడి మొక్కలు నాటాడు. గురువారం రామచంద్రయ్య కుటుంబసభ్యులు ఈ మామిడి మొక్కలను నరుకుతుండగా తిరుపతిదాసు, అతడి భార్య బేబి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని 108లో విస్నన్నపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): పెదవేగి పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ బాలాజీ నాయక్‌కి ఇఫ్టూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. వివరాలను ఏలూరులో గురువారం పత్రికలకు వెల్లడించారు. పామాయిల్‌ ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని, రైతులకు అండగా ఉండాలని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని ఎండీని కోరామన్నారు. ఎండీని కలిసిన వారిలో మాణికొండ కాంతారావు, ముక్కు సుబ్బారావు, సింహాచలం, ఈశ్వరరావు ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. స్థానిక ఏఐటీయూ సీ కార్యాలయంలో గురువారం మిడ్‌డే మీల్‌ వర్కర్స్‌ సమావేశంలో జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్‌ డాంగే, జిల్లా సహాయ కార్యదర్శి పి. కిషోర్‌ మాట్లాడారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో భోజన కార్మికులు అప్పులు చేసి వండి వార్చాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదలతో నిర్లక్ష్యం తగదని, అలాగే కార్మికులకు కేవలం రూ.3 వేలు గౌరవ వేతంన ఇవ్వడం సిగ్గుచేటన్నారు. వీరి గౌరవ వేతనం పెంచాలని కోరారు.

దెందులూరు: మండలంలోని జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ ఐస్‌ స్కేటర్‌ జెస్సీరాజ్‌ మత్రాపు ఖేలో ఇండి యా వింటర్‌ గే మ్స్‌–2026లో రజత పతకం సాధించింది. లడక్‌లో ఈనెల 20 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. జెస్సీరాజ్‌ సీనియర్‌ గరల్స్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ కేటగిరీలో రెండో స్థానంలో ని లిచి పతకం సాధించింది. ఆమెను ఐస్‌ స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అమితాబ్‌ శర్మ, ఏపీ ఐస్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఖాజా, అధ్యక్షుడు మురళి, కోచ్‌ అబ్దుల్‌ హఫీజ్‌, శాప్‌ క్రీడల అధికారి సురేందర్‌బాబు తదితరులు అభినందించారు.

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌ 1
1/2

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌ 2
2/2

వేగంగా వైఎస్సార్‌సీపీ కమిటీల డిజిటలైజేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement