శోభాయమానం.. శోభనాచలుని రథోత్సవం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆదివారం అర్ధరాత్రి స్వామివారి కల్యాణ మండపంలో నృసింహస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నూతన వధూవరులను విశేష పుష్పాలతో అలంకరించిన రథంపై ఆశీనులు గావించగా.. మంత్రి పార్థసారథి ప్రత్యేక పూ జలుచేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణ మండపం మీదుగా దమ్మన్న మండపం, వెంకటాచల మండపం, పొగడ చెట్ల మండపం మధ్య ఉన్న నాలుగు వీధుల నడుమ రథోత్సవం సాగింది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. కోలాట నృత్యాలు, బుట్టబొమ్మల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రథం ముందుకు సాగింది. పొన్నం వెంకట లక్ష్మణరావు సో దరులు రథాన్ని అలంకరించగా అద్దంకి శివ సత్యనారాయణ బృందం రథసారథులుగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ సాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై శుభశేఖర్, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
శోభాయమానం.. శోభనాచలుని రథోత్సవం


