సగర్వం.. గణతంత్రం
న్యూస్‌రీల్
రైల్వే కాలనీలో చోరీ
భీమవరం రైల్వే కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 13 కాసుల బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నట్టు తెలిసింది. 8లో u
● ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని వై భవంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజం కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీసు శాఖకు చెందిన 8 విభాగాల కంటింజెంట్లు పరేడ్ కమాండర్ ఆర్మ్‌డ్ పోలీస్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జీఎస్‌పీ పవన్‌కుమార్ సారథ్యంలో గౌరవ వందనం సమ ర్పించారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జె డ్పీ సీఈఓ కె.సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ గాయత్రి, సెట్‌వెల్ సీఈఓ కె.ప్రభాకరరావు, డీఎస్‌డీఓ అజీబ్ తదితరులు పాల్గొన్నారు.
భళా.. సాంస్కృతిక హేల
గణతంత్ర వేడుకల్లో జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నూజివీడుకు చెందిన త్రివిధ హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు ప్రథమ, బుట్టాయ గూడెం మండలం తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రదర్శనకు ద్వితీయ, రెడ్డి చిన్నవెంకన్న శిష్య బృందం వందే మా తరం కర్ర సాము విన్యాసాలకు తృతీయ బ హుమతి లభించాయి. ఆయా బృందాలకు కలెక్టర్, ఎస్పీ మెమెంటోలు అందించారు.
శకటాలు.. స్టాల్స్ ప్రదర్శనలు : ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యాశాఖ శకటానికి ప్రథమ, ఐటీడీఏ (కేఆర్‌పురం) శకటానికి ద్వితీయ, గృహ నిర్మాణ శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. వీటికి సంబంధించి జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఐటీడీఏ అధికారులు, హౌసింగ్ పీడీ సత్యనారాయణకు కలెక్టర్ బహుమతులు అందించారు. ఉద్యాన శాఖ స్టాల్‌కు ప్రథమ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎస్) స్టాల్‌కు ద్వితీయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) స్టాల్‌కు తృతీయ బహుమతి లభించింది. కలెక్టర్ స్టాల్స్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సగర్వం.. గణతంత్రం
సగర్వం.. గణతంత్రం


