కేంద్రం పన్నుతో రైతు కుటుంబాల్లో సంక్షోభం
మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రికి వినతి
కొయ్యలగూడెం: అకస్మాత్తుగా పన్ను పెంపు వల్ల ఎఫ్‌సీవీ పొగాకు సాగుపై ఆధారపడిన లక్షలాది రై తు కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని, అలాగే నియంత్రిత మార్కెటింగ్ వ్యవస్థకు భంగం కలుగుతుందని కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. చట్టబద్ధ వ్యాపారం తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆదాయం, వేలం స్థిరత్వం, మొత్తం డిమాండ్ కొనసాగాలంటే తక్కువ గ్రేడ్ పొగాకు లభ్యత, వినియోగం కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎకై ్సజ్ డ్యూటీ పన్ను రద్దు చేయాల్సిందిగా వర్జీనియా పొగాకు రైతు సంఘం ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు విన తిపత్రం సమర్పించారు. గురువారం బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఎంపీ దగ్గుబాటి పు రందేశ్వరితో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రైతుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఈ వివరాలను కాకర్ల నంది వివరించారు. కొనుగోలుదారుల పాల్గొనడం తగ్గితే వేలాల్లో పోటీ తగ్గి ధరలు పడిపోవడం, అమ్ముడుపోని నిల్వలు పెరగడం, చివరకు రైతుల జీవనోపాధితో పాటు మొత్తం విలువ గొలుసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆంధ్రా, తెలంగాణలో రైతు లు, పంట సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెల నుంచి వేలాలు ప్రారంభం కానున్నాయన్నారు. పన్ను పెంపుతో దేశీయ వినియోగం గణనీయంగా తగ్గి, ధరలు తీవ్రంగా పడిపోతాయన్నారు. దక్షిణాఫ్రికాలో అక్రమ వ్యాపారం సుమారు 75 శాతం మార్కెట్‌కు విస్తరించడంతో చట్టబద్ధ ఫ్యాక్టరీలు మూతపడ్డ వ్యవహారాన్ని ప్రస్తావించామన్నారు.


