లడ్డూపై కూటమి కుట్ర భగ్నం
కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ఏలూరులో వైఎస్సార్‌సీపీ నాయకుల పూజలు
ఏలూరు టౌన్: వేంకటేశ్వరస్వామీ.. కూటమి నేతలకు బుద్ధి ప్రసాదించు అంటూ వైఎస్సార్‌సీపీ నాయకు లు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదంటూ సీబీఐ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల రాజకీయ కుట్ర బద్ధలైందంటూ వైఎస్సార్‌సీపీ ఏ లూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. గురువారం ఏలూరులోని ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుపతి వెంకన్న పవిత్రను కించపరిచేలా, స్వామివారి ప్ర సాదం లడ్డూని ఆయుధంగా మార్చి చంద్రబాబు రచించిన కుట్రపూరిత నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. ఇంత నీచమైన రాజకీయాన్ని, మతం పేరు తో ప్రజలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలనే రాజకీయ క్రీడను ఎన్నడూ చూడలదేన్నారు. 18 నెలల అనంతరం సీబీఐ చార్జిషీట్‌లో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందన్నారు. కూ టమి నేతలకు భవిష్యత్తులో ప్రజలు సరైన గుణపా ఠం చెబుతారని జయప్రకాష్ అన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బా బు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నాయ కులు గంటా మోహనరావు, భాస్కర్ల శంకర్, ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు.


