సమష్టిగా పోరుబాట
● వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
● ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో నేతలు
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలంతా పోరుబాట పడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. నగరంలో జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి, శివారెడ్డి, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా నిర్మించడంతో ప్రతి నాయకుడు, కార్యకర్త కీలకపాత్ర పోషించాలని నేతలు చెప్పారు. జిల్లాలో మండల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు, వార్డు, గ్రామస్థాయి పార్టీ కమిటీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేననీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలన్నారు.
ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, కొఠారు రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) నూకపెయ్యి సుధీర్‌బాబు, దాసరి రమేష్, డీవీఆర్‌కే చౌదరి, ఎస్‌ఈసీ మెంబర్ దయాల నవీన్‌బాబు, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, వడ్డీలు కార్పొరేషన్ అధ్యక్షులు ముంగర సంజయ్, సూర్యబలిజ కార్పొరేషన్ అధ్యక్షులు శెట్టి త్యాగరాజు, రాష్ట్ర బూత్ కమిటీ జోన్ అధ్యక్షులు బీవీఆర్ చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జెడ్పీ వైస్ ఛైర్మన్ పెనుమాల విజయ్, జెట్పీటీసీ నిట్టా లీలానవకాంతం తదితరులు పాల్గొన్నారు.


