పేదల నెత్తిన బండ | - | Sakshi
Sakshi News home page

పేదల నెత్తిన బండ

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

న్యూస్‌రీల్‌

గ్యాస్‌ కనెక్షన్లు పశ్చిమ ఏలూరు

జనరల్‌ కనెక్షన్లు 4,02,335 4,06,128 దీపం కనెక్షన్లు 1,83,183 1,92,212 ఉజ్వల కనెక్షన్లు 27,420 27,639 సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 8,528 18,243 5 కేజీల కనెక్షన్లు 160 1,557 మొత్తం 6,21,626 6,45,779

పేదలపై మరింత భారం

పెంచిన ధరలను తగ్గించాలి

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరల చెంతన వంట గ్యాస్‌ చేరింది. డొమెస్టిక్‌ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.110 చొప్పున ధరలు పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పేదలు ఇబ్బంది పడుతుండగా గ్యాస్‌ ధరల పెంపు గుబులు పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని గృహ వినియోగదారులపై ఏడాదికి రూ.50.84 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఐఓసీకి చెందిన 20, హెచ్‌పీసీ 18, బీపీసీ గ్యాస్‌ ఏజెన్సీలు నా లుగు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్‌) కనెక్షన్లు ఉన్నాయి. మొన్నటివరకు 14.20 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ రూ.892లు, అలాగే 19 కిలోల వాణిజ్య (కమర్షియ ల్‌) సిలిండర్‌ రూ. 1850.50 ధర ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌పై రూ.60, కమర్షియ ల్‌పై రూ.110లు పెంచింది. శుక్రవారం రాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలిండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్‌ కోసం ఇప్పటివరకు ఏడాదికి రూ.6,244 లు వెచ్చిస్తే, ప్రస్తుత ధర ప్రకారం రూ.6,664 చెల్లించాలి. జిల్లాలో ఉజ్వల కనెక్షన్లు దాదాపు 27,420 ఉండగా వీటిపై పెంపు లేదని ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరల మేరకు జిల్లా వాసులపై రూ.24.94 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. అలాగే ఏలూరు జిల్లాలోని గ్యాస్‌ వినియోగదారులు ఏడాదికి 45.2 లక్షల సిలిండర్లు వినియోగిస్తారని అంచనా. ఉజ్వల, ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లు మినహాయించగా రూ.25.9 కోట్ల భారం పడుతుందని అంచనా.

బుకింగ్‌ నిబంధనల్లో మార్పు

గ్యాస్‌ బుకింగ్‌ విషయంలో కేంద్రం పరిమితులు విధించింది. గ్యాస్‌ కంపెనీలు సేల్స్‌ పెంచుకునే క్రమంలో ఇప్పటివరకు పరిమితి లేకుండా వినియోగదారులకు సిలిండర్లు ఇస్తూ వచ్చాయి. ఈ క్రమంలో డొమెస్టిక్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు దా రి మళ్లిస్తున్నారు. జిల్లాలోని హోటళ్లు, స్వీట్‌షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు తదితర ఎక్కడ చూసినా కమర్షియల్‌కు బదులుగా డొమెస్టిక్‌ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల నుంచి నేరుగా డొమెస్టిక్‌ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నా యి. తాజా పరిస్థితుల నేపథ్యంలో సింగిల్‌ సిలిండర్‌ వినియోగదారులు బుకింగ్‌ కోసం 21 రోజులు, డబుల్‌ సిలిండర్లు ఉన్నవారు 30 రోజుల వ్యవధిలో బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పేదలపై పెనుభారం

2024 అక్టోబరులో రేషన్‌ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గతే డాది ఫిబ్రవరిలో అంతంతమాత్రంగా సరఫరా చేసి తర్వాత నెల మొత్తం నిలిపివేసింది. ఒక్కో కార్డుపై రూ.20లకు కిలో గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్‌ ప్రాజెక్టు పేరిట నగరా లు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 1,052 రేషన్‌ డిపోల పరిధిలో 5,67,700 రేషన్‌ కార్డులకు గాను భీమవరంలోని 49 రేషన్‌ దుకాణాల్లోని 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు.

సిలిండర్‌

గ్యాస్‌ ధరల పెంపుతో అదనపు భారం

‘పశ్చిమ’లో 6.21 లక్షలు,

ఏలూరు జిల్లాలో 6.45 లక్షల కనెక్షన్లు

ఇకపై బుకింగ్‌ ని‘బంధనాలు’

21 రోజుల తర్వాతే మరో సిలిండర్‌ జారీ

వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తున్నా చర్యలు శూన్యం

సరుకుల ధరల మంట

మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125లు నుంచి రూ.132లు వరకు ఉన్నాయి. పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.137లు ఉండగా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.170లు వరకు ఉంది. అదేమాదిరి ఇతర నూనెల ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవని పరిస్థితి. తాజాగా గ్యాస్‌ ధరలు పెరగడం పేదవర్గాల వారికి మరింత భారం కానుంది.

పేదలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఇష్టానుసారంగా అన్ని ధరలను పెంచేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులు ఇస్తామని మూడు నెలలు మాత్రమే కందిపప్పు ఇచ్చారు.

– కొరపాటి అనిత, గృహిణి, చెరుకువాడ

నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వంట గ్యాస్‌ ధరలు పెంచడం సరికాదు. దీనివలన ప్రజలపై మరింత భారం పడుతుంది. పెంచిన ధరలు తగ్గించాలి.

– రేకపల్లి అమ్మాజీ, గృహిణి, రాయకుదురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement