గ్యాస్‌ ధరల పెంపుపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధరల పెంపుపై మండిపాటు

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

గ్యాస్‌ ధరల పెంపుపై మండిపాటు

ఏలూరు (టూటౌన్‌): మోదీ సర్కార్‌ పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏలూరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద వీవీ నగర్‌ ఆవరణలో ఇఫ్టూ నగర కమిటీ, మార్కెట్‌ యార్డ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస్‌ రా వు అధ్యక్షత వహించగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఇఫ్టూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. ధరలను అరికట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఏడాదిలో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.122 పెంచడం దారుణమన్నారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్ప టికే ప్రజలు సరైన ఉపాధి, ఉద్యోగ భద్రత లేక జీవ నం సాగిస్తున్నారని, ఈ సమయంలో గ్యాస్‌ ధరల పెంపు సరికాదన్నారు. యుద్ధాలను నివారించేలా ప్రయత్నించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement