హెల్త్‌ సెక్రటరీల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ సెక్రటరీల ఆందోళన

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

హెల్త్‌ సెక్రటరీల ఆందోళన

ఏలూరు (టూటౌన్‌): వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్‌ సెక్రటరీలకు జీఓ 124ను అమలు చేసి వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులకే పరి మితం చేయాలని కోరుతూ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) జి ల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ హెల్త్‌ సెక్రటరీలు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ సెక్రటరీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీలక్ష్మి మా ట్లాడుతూ హెల్త్‌ సెక్రటరీలను వైద్యారోగ్యశాఖలో విలీనం చేయాలని కోరారు. పని భారాన్ని తగ్గించాలని, ఇతర శాఖల పని నుంచి విముక్తి కల్పించాలని కోరారు. జిల్లాలో తక్షణమే పదోన్నతుల రెండో జా బితా విడుదల చేయాలని, నేషనల్‌ ఇంక్రిమెంట్‌ అలవెన్స్‌ ఇప్పించాలని కోరారు. అనంతరం డీఆర్వో, డీఎంహెచ్‌ఓకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు నీలాదేవి, నాగమణి, పోశమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement