ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకుగాను ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. సోమవారం కలెక్టరేట్‌లోని ఆ సంస్థ ప్రతినిధి టీఎన్ అనంత్ కలెక్టర్ కె.వెట్రి సెల్వికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, స్థిరమైన ప్లాస్టిక్ నిర్వహణ, రీసైక్లింగ్ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్ జారీ చేసింది. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): దేశంలో లేబర్ కోడ్‌లు అమలయితే శ్రామిక మహిళలకు తీవ్ర నష్టం తప్పదని రిటైర్డ్ జిల్లా జడ్జి అడబాల లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం శ్రామిక మహిళలు ఉద్యమించాలని పి లుపునిచ్చారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ మాజీ జిల్లా నాయకురాలు కాగిత నాగమణి, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహిళా వి భాగం అధ్యక్షురాలు బండి భవాని, హాస్టల్స్ వ ర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు ఎస్. లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 55 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ గణితం–బీ2 పరీక్షకు 9,596 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 8,588 మందికి 8,486 మంది, 1,236 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,110 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ఇంటర్ భౌతిక, రాజనీతి శాస్త్రాల పరీక్షలకు 556 మంది విద్యార్థులు హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 224 మందికి 198 మంది, రాజనీతిశాస్త్రం పరీక్షకు 391 మందికి 348 మంది హాజరయ్యారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని, ఇప్పటివరకూ జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టుపై మాట్లాడు తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు అ న్యాయం జరుగుతోందని సీపీఎం ఏదైతే చెబుతుందో అదే వెల్లడయ్యిందన్నారు. పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని, అనర్హులకు వందల కోట్లు కట్టబెట్టారని, కాంట్రాక్టర్లు దోచుకున్నా రని వీటిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
తణుకు అర్బన్: తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు దృశ్య కళా వైభవ పురస్కారం అందుకున్నారు. కళాతపస్వి దామెర్ల రామారావు 130వ జయంతి పు రస్కరించుకుని రాజమండ్రి చిత్ర కళానికేతన్ ఆధ్వర్యంలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ప్రత్యక్ష చిత్ర రచనా విన్యాసం ప్రదర్శనలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది చిత్రకారులు పాల్గొన్నారు. వెంపటాపు శివో హం శీర్షికతో ప్రత్యేక చిత్ర రచన చేశారు. తాను ప్రదర్శించిన గాంధీ గమనం నమో అంతర్ముఖి చిత్రాలకు ప్రశంసలు అందాయన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు డి.మునిరత్నం నాయుడు చేతులమీదుగా పురస్కారం అందుకున్నానన్నారు.


