తణుకు అర్బన్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఆకుల ఐశ్వర్య (13) నిడదవోలులో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్రపురానికి చెందిన ఆకుల ప్రసాద్, శాంతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా ఐశ్వర్య 9వ తరగతి, నిర్మల 10వ తరగతి తణుకు జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నారు. 2019 నుంచి వీరిద్దరూ స్థానికంగా ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నారు. తల్లిదండ్రులు శాంతి, ప్రసాద్ మనస్పర్థలతో ఎనిమిదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ప్రసాద్ నారాయణపురంలో, శాంతి నిడదవోలులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న ఐశ్వర్య పుట్టినరోజు కావడంతో తల్లి శాంతి తణుకు వచ్చి ఐశ్వర్యను నిడదవోలు తీసుకువెళ్లింది. పాఠశాలలో తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచిన తర్వాత ఐశ్వర్య తల్లితో కలిసి వెళ్లింది. ఇదిలా ఉండగా ఆదివారం తాను చర్చికి వెళ్లానని, ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య ఉరి వేసుకుని చనిపోయిందని తల్లి శాంతి చెబుతోంది. బాలిక మృతదేహాన్ని వీరభద్రపురం తీసుకువచ్చిన కుటుంబసభ్యుల సాయంతో సోమవారం అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తండ్రి ప్రసాద్ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం ఇచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. బాలిక మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకురాగా తణుకు రూరల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిడదవోలు పోలీసులు మృతదేహాన్ని నిడదవోలుకు తరలించారు.
పుట్టినరోజున స్నేహితుల మధ్య..
తల్లితోపాటు పాఠశాలకు వచ్చిన ఐశ్వర్య తోటి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపిందని ఉపాధ్యా యులు చెబుతున్నారు. బాలిక చదువులోనూ చు రుగ్గా ఉంటుందని తెలుస్తోంది. కుమార్తె మృతి ఘ టనలో భార్య శాంతిపై ప్రసాద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని ఉంటే అందుకు సంబంధించిన ఆనవాళ్లు మృతదేహంపై లేవని ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు బాలిక నిడదవోలులో ఆత్మహత్య!


