కవి ప్రసాద్‌కు జాతీయ పురస్కారం
తణుకు అర్బన్: తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్ అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈనెల 21వ తేదీన విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నట్లు కవి ప్రసాద్ తెలిపారు. తెలుగు భాషకు గౌరవం, తెలుగు సంస్కృతికి గుర్తింపు, తెలుగు సంప్రదాయలకు చేస్తున్న సాహిత్య కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు వివరించారు. కవి సార్వభౌమ శ్రీనాధ కవి వంశీయులు డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, శ్రీశ్రీ కళాశేదిక జాతీయ కార్యదర్శి నూకే బాలార్జున సత్యనారాయణ, సుప్రసిద్ధ సామాజిక సేవకులు, కవి జాబాది మోహన్ తదితరులు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి గజమాలతో సత్కరించినట్లు చెప్పారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి కవి ప్రసాద్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.


