జేఈఈ మెయిన్స్‌కు 1,397 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షల్లో బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో మొత్తం 1397 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి సెషన్‌లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌లో 150 మందికి 149 మంది హాజరు కాగా సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 150 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 140 మందికి గాను 140 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 111 మందికి గాను 111 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది, డీఎన్నాఆర్ కేంద్రంలో 101 మందికి గాను 100 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌లో 150 మందికి 149 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 151 మందికి గాను 148 మంది, వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 133 మందికి గాను 133 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 117 మందికి గాను 117 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి గాను 50 మంది హాజరు కాగా, డీఎనన్నాఆర్ కళాశాల కేంద్రంలో 101 మందికి గాను 101 మంది హాజరయ్యారు.


