గరుడ వాహనంపై శోభనాచలుడు | - | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై శోభనాచలుడు

Jan 29 2026 6:16 AM | Updated on Jan 29 2026 6:16 AM

గరుడ

గరుడ వాహనంపై శోభనాచలుడు

గరుడ వాహనంపై శోభనాచలుడు హుండీ ఆదాయం లెక్కింపు

ఆగిరిపల్లి : శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో వలివేటి శేష శోభనాచల శ్రీనివాసరావు దంపతులు, వలివేటి హేమ శ్రీధర్‌ దంపతుల కై ంకర్యంలో స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిపించారు. రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

పెదపాడు: మండలంలోని అప్పనవీడులో అభయాంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఏలూరు తనిఖీదారు వి సురేష్‌ పర్యవేక్షణలో లెక్కించారు. స్వామివారికి రూ.12,44,579 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తారకేశ్వరరావు తెలిపారు. 85 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావుతోపాటు భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గరుడ వాహనంపై శోభనాచలుడు 1
1/1

గరుడ వాహనంపై శోభనాచలుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement