తాగునీటి పైప్‌లైన్లకు మరమ్మతులు
బుట్టాయగూడెం: మండలంలోని నందాపురం సమీపంలోని పునరావాస కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి శుక్రవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. కాలనీలో పైప్‌లైన్‌లు పగిలిపోయి బురదనీరు రావడంతో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘పునరావాస కాలనీలో సమస్యల పోరు’ కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, నిమ్మలగూడెం పంచాయతీ కార్యదర్శి జి.విమలాదేవి పునరావాస కాలనీని సందర్శించారు. పాడైపోయిన పైప్‌లైన్‌లను మరమ్మతులు చేయించారు. మరో రెండు లైన్‌లు ఉన్నాయని అవి శనివారం పూర్తి చేస్తే మొత్తం కాలనీ అంతటికీ మంచినీరు సరఫరా అవుతుందని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
తాగునీటి పైప్‌లైన్లకు మరమ్మతులు


