ఈ–రిక్షాలు పంపిణీ చేయాలి
రిక్షా కార్మికులకు ప్రత్యేక పెన్షన్లు లేదా ఆర్థిక సాయం అందించాలి. కాలం చెల్లిన రిక్షాల స్థానంలో రాయితీపై ఈ–రిక్షాలు పంపిణీ చేయాలి. రిక్షా కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి కుటుంబాలకు ఆరోగ్య భీమా కల్పించాలి.
– ముళ్ళగిరి ఇమ్మానియేలు, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు
40 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్నాను. అప్పట్లో మా కుటుంబాన్ని, పిల్లలను రిక్షా తొక్కే పోషించాను. గతంలో రోజంతా కష్టపడితే రూ.500 నుంచి వెయ్యి వరకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు రూ.300 రావడం కూడా గగనమైపోయింది. ఆటోలు వచ్చాక మమ్మల్ని పట్టించుకునేవారే లేరు.
– హెచ్ భీమయ్య, రిక్షా కార్మికుడు, చింతలపూడి
ఈ–రిక్షాలు పంపిణీ చేయాలి


