అసైన్డ్ భూముల ఆక్రమణ
చాట్రాయి: ప్రభుత్వం మాది ఆక్రమించుకునే హక్కు మాదే అన్న రీతిలో ఉంది టీడీపి నాయకుల తీరు. మండలంలోని కొత్తగూడెం శివారు యర్రవారిగూడెం గ్రామంలో 206 సర్వే నంబరులో 2 ఎకరాలు అసైన్డ్ భూమి, 26–1 సర్వే నెంబర్లలో 10.90 ఎకరాల పశువుల బీడు(ప్రభుత్వ భూమి) ఉంది. ఖాళీగా ఉన్న ఈ భూముల్లో స్థానిక టీడీపీ నేతల కన్ను పడింది. దీంతో వారం క్రితం ఆక్రమించుకుని జేసీబీతో చదును చేసి మడులు కట్టి పామాయిల్ మొక్కలు నాటారు. గత ప్రభుత్వంలో ఎస్సీలు సాగు చేసుకుంటున్న భూమిని సైతం లాగేసుకున్నారు. రెండ్రోజుల క్రితం మళ్లీ భూమిని రాత్రి సమయంలో జేసీబీతో చదును చేస్తుండగా బీట్‌లో ఉన్న పోలీసులు పట్టుకుని స్టేషన్‌కి తరలించి తహసీల్దార్‌కి సమచారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డు పెట్టింది.


