లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ఉంగుటూరు: తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీని హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటన బుధవారం ఉదయం జాతీయరహదారిపై బాదంపూడి – ఉంగుటూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సులో డ్రైవరు మినహా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జు అవడంతో అందులో డ్రైవర్ ఇరుక్కుపోయి గాయాలయ్యాయి. స్థానికులు బస్సు నుంచి గాయపడిన డ్రైవర్‌ను బయటకు తీసి 108 అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ మినహా ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం


