విజిలెన్స్ దాడులు
ఏలూరు టౌన్: ఏలూరులో విజిలెన్స్, రెవెన్యూ, జీఎస్‌టీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దా డులు చేశారు. ఐదు షాపుల్లో నిషేదిత గుట్కా ప్యా కెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు వీటిని అప్పగించి, క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకటేశ్వరరా వు తెలిపారు. విజిలెన్స్ సీఐ డి.ప్రసాదకుమార్, గంగాభవానీ, ఎస్సై సీహెచ్ రంజిత్‌కుమార్, కె.సీతారాము, కె.నాగరాజు, జీఎస్‌టీ అధికారి కె.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.


