అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి

అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి

అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావించాలి

ఏలూరు (టూటౌన్‌): ఈనెల 28వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు అంశం ప్రస్తావించాలని, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్‌ పొలిమేర హరికృష్ణ డిమాండ్‌ చేశారు స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పదేళ్ల లోపు పెంచుకోవచ్చని పేర్కొనబడిందని, ఇప్పటికి 12 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లకు ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ రాజకీయ పార్టీల పెద్దలను కోరుతున్నట్లు హరికృష్ణ చెప్పారు, ఈ సమావేశంలో సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement