సుందరగిరిపై ‘కల్యాణ కాంతులు’
●నారసింహుని కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం ●నేడు వరుడు కానున్న స్వామివారు
కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇరువైపులా విద్యుద్దీప అలంకారాలు, నారసింహుని భారీ విద్యుత్ కటౌట్
ద్వారకాతిరుమల: నారసింహుని దివ్య కల్యాణ మహోత్సవాలకు ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరి పర్వతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. అలాగే సుందరగిరిపై ఏర్పాటు చేసిన నారసింహుని భారీ విద్యుత్ కటౌట్, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా అమర్చిన విద్యుద్దీప తోరణాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వృక్షాలు సైతం విద్యుత్ అలంకరణలతో కనువిందు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అందులో భాగంగా ఉత్సవాల తొలిరోజు గురువారం ఉదయం 10.15 గంటలకు ఆలయ అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. యావన్మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు.
సుందరగిరిపై ‘కల్యాణ కాంతులు’
సుందరగిరిపై ‘కల్యాణ కాంతులు’


