జాతీయ పురస్కారానికి తడికలపూడి పాఠశాల
కామవరపుకోట : జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారానికి తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో పరిశుభ్రత ,పచ్చదనం, నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి అంశాలను ప్రోత్సహిస్తూ మన రాష్ట్రం నుంచి 20 పాఠశాలల జాబితాలో తడికలపూడి పాఠశాల కూడా ఎంపికై నట్లు ఆయన తెలిపారు. అందుకు కృషి చేసిన హెచ్‌ఎం సర్వేశ్వరావును మండల విద్యాశాఖ అధికారులు డి. సుబ్బారావు, చిన్నం ప్రశాంత్ కుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గ్రామస్తులు అభినందించి సత్కరించారు. సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్, స్కూల్ కమిటీ చైర్మన్ వెలమాటి నాగేశ్వరరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, బొంతు వెంకటేశ్వరరావు, తూతా లక్ష్మణరావు, తూతా బాలాజీ తదితరులు పాల్గొన్నారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన తొలి సెషన్ పరీక్షలకు మొత్తం 700 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించిన రెండో సెషన్ పరీక్షకు 708 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిసెషన్‌లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌లో 150 మందికి 146 మంది హాజరు కాగా సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 144 మంది, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 149 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 115 మందికి గాను 113 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది హాజరు కాగా. డీఎనన్నాఆర్ కళాశాలలో 100 మందికి 99 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌లో 150 మందికి గాను 149 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 147 మంది, వాసవీ ఇంజనీరింగ్ కేంద్రంలో 147 మందికి 144 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 119 మందికి 118 మంది భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 50 మంది, డీఎన్నాఆర్ కళాశాల కేంద్రంలో 100 మందికి గాను 100 మంది హాజరయ్యారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం జిల్లాలోని 130 కేంద్రాల్లో ఎథిక్స్, అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ తెలిపారు. పరీక్షకు మొత్తం 15,258 మంది జనరల్ విద్యార్థులకు 14,881 మంది హాజరు కాగా 377 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 2319 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,209 మంది హాజరు కాగా 110 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఈ నెల ఒకటి నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 22, 24 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్‌ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు హెల్మెట్ ర్యాలీని స్థానిక శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్థానిక పాత బస్టాండు వరకూ నిర్వహిస్తామన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు హెల్మెట్ ధరించి పాల్గొనాలని కోరారు. అలాగే ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి వాక్‌థాన్ నిర్వహిస్తామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లాలోని ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. విజేతలకు ఈ నెల 25న కలెక్టరేట్లోని గోదావరి ఫంక్షన్ హాల్‌లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.


