ఎన్టీఆర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఫిబ్రవరి 11 నుంచి 15 వరకూ దిండిగుల్ల పీఎస్‌ఎన్‌ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయని ఆశ్రం కళాశాల పీడీ వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మహిళల జట్టు కోసం ఈ నెల 30న ఆశ్రం కళాశాల ఆవరణలో ఎంపిక పోటీలు చేపట్టామని వెల్లడించారు. ఆశ్రం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చేబ్రోలు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, సీఈఓ డాక్టర్ కె.హనుమంతురావు పర్యవేక్షణలో సెలక్షన్ కమిటీ సభ్యులైన ఫిజికల్ డైరక్టర్లు ఈ.త్రిమూర్తి, డీవీవీఎస్ శ్రీనివాస్, వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు, జి.నాగరాజు కలిసి జట్టును ఎంపిక చేశశాని పేర్కొన్నారు.
టి.నరసాపురం : విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెడ్లం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీమ్(38) అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్‌మెన్ వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న సాయంత్రం ఇద్దరు వెళ్ళి తెడ్లం గ్రామ శివార్లలో రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎల్‌టీ వైరులోని కండక్టర్ కుడి చేతి బొటన వేలుకు తగిలి కరెటుషాక్ తో ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి కిద పడిపోయాడు. వెంటనే అసిస్టెంట్ లైన్‌మెన్, రైతు ఇద్దరు కలిసి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


