శేష వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి: స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాసం మంగళవారం రాత్రి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో నాగిరెడ్డి పాపా అప్పారావు దంపతులు కై ంకర్యపరులుగా వ్యవహరించి స్వామివారికి శాంతి కల్యాణం జరిపారు. రాత్రి 8 గంటలకు వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ వైభవంగా నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,07,755 ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదానం సత్రంలో 2,221 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమీక్షా సమావేశానికి అధికారులు బాధ్యతాయుతంగా హాజరుకావాలని చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారుల గైర్హాజరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ఏలూరు జిల్లాలో శానిటేషన్, చెత్త ప్రాసెసింగ్ కార్యక్రమాలకు సంబంధించి డీపీఆర్ ఆధారంగా పనులను వేగవంతంగా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని చైర్‌పర్సన్ ఆదేశించారు.
బోరు నీటి నుంచి వచ్చిన
గ్యాసే ప్రమాదానికి కారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం మాధవునికుంట చెరువులో మంగళవారం ఉదయం చేపలు, చేప పిల్లలు పెద్ద ఎత్తున చనిపోయాయి. వివరాల్లోకి వెళితే. మాధవుని కుంట చెరువులోకి ఎలా వచ్చాయో తెలియదు కానీ గొరక, బంగారుతీగ, శీలావతి చేపలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఇటీవల పంచాయతీ వారు నూతనంగా బోరును నిర్మించారు. ఆ నీటిని చెరువులోకి పంపుతున్నారు. చెరువులోని నిల్వ నీరు బయటకు వెళ్లేందుకు అవుట్‌లెట్ లేకపోవడంతో, బోరు నీటిలోంచి వచ్చిన గ్యాస్ కారణంగా ఆక్సిజన్ అందక చేపలు, చేప పిల్లలు చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా చనిపోయిన చేపలు కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని చుట్టుపక్కల వారు దేవస్థానం అధికారులకు సమాచారం అందించగా వారు పంచాయతీ అధికారులతో మాట్లాడారు. దీంతో పంచాయతీ కార్యదర్శి జీటీవీ శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికులతో చెరువులో చనిపోయిన చేపలు, చేప పిల్లలను తొలగింపజేశారు.
శేష వాహనంపై శోభనాచలుడు
శేష వాహనంపై శోభనాచలుడు


