ప్రజాస్వామ్య విలువలకు పాతర
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇళ్లపై రౌడీలతో దాడులు చేయించడం దుర్గార్మం. ఈ దాడులను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని నివేదికలు రావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు.
– దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త
మాజీ మంత్రులు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టడం, అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్లి ధ్వంసం చేయడం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే నిరంతరం కేసులు పెడుతూ వేధిస్తోంది. ఎంతగా అణచివేయాలని చూస్తే తిరిగి అంత వేగంగా పైకి లేస్తాం. ప్రభుత్వం సక్రమ పాలన అందించాలి.
– మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంతో కూడిన రాక్షస చర్యలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
– తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే
ప్రజాస్వామ్య విలువలకు పాతర
ప్రజాస్వామ్య విలువలకు పాతర


